పంజాగుట్టలోని ఓ హోటల్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. షాన్‌బాగ్ హోటల్‌లోని ఐదో అంతస్తులో మంటలు ఎగసి పడ్డాయి. కిచెన్‌లోని తందూరి రోటీ బట్టీలోని చిమ్మిలో ఆయిల్ పేరుకు పోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పలువురు కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంట్లో మున్నూరు కాపు నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తి వ్యక్తం చేశారు. వీహెచ్ ఇంట్లో భేటీకి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కీలక నేతలు హాజరయ్యారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ-ఫైనల్స్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ షార్ట్ గాయపడ్డాడు. ఈ క్రమంలో అతను సెమీ-ఫైనల్స్‌కు దూరం కానున్నాడు.
మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మంజీరా నదిలో మునిగి ఇద్దరు మృతి చెందారు. కొల్చారం (మం) పోతంశెట్ పల్లి శివారులో రెండో బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడుపాయల జాతరకు వచ్చిన నలుగురు యువకులు స్నానం కోసం నదిలోకి దిగారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్‌పోర్ట్ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఔట్ పోస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీపీ అవినాష్ మహంతి, ఎయిర్‌పోర్ట్ సీఈఓ ప్రదీప్ ఫనికర్, సీఐఎస్ఎఫ్‌డీజి మొహంక్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ చింతపండు నీవన్ (తీన్నార్ మల్లన్న)కు బిగ్ షాక్ తగిలింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలాకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ గుర్తించింది.
వరంగల్ మామునూర్ ఎయిర్‌పోర్టు ప్రాంగణం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తల మద్య తోపులాట జరిగింది. మామునూరు ఎయిర్ పోర్ట్‌కు ఆమోదం రావడంతో కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో వేరువేరుగా సంబరాలు చేసుకుంటున్నారు.
తెలంగాణలో 13 రోజుల పాటు కులగణన రీ సర్వే జరిగింది. ఈ సర్వేలో కూడా ఆశించిన సంఖ్యలో కుటుంబాలు తమ వివరాలు నమోదు చేసుకోలేదు. మొదటిసారి నిర్వహించిన కుల గణన సర్వేలో 3.56 లక్షల కుటుంబాలు వివరాలు నమోదుచేసుకోకుండా మిగిలిపోయాయి. ఈ క్రమంలో ప్రభుత్వం రీ సర్వే చేపట్టింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రెండో విడత కుల గణనకు తక్కువ స్పందన వచ్చిందని తెలిపారు.
హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఓ టూ వీలర్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో టూ వీలర్ పై వెళ్తున్న ఒకరు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.