రాజా దుస్సా దర్శకత్వంలో శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్ పై గాలి కృష్ణ నిర్మిస్తున్న సినిమా టైటిల్ 'అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే'. తెలంగాణ యాస భాష నేపథ్యంలో " అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే " అంటూ పూర్తి వినోదాత్మకమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్.. కన్నప్ప సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.. మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ భాగంగా.. మంచు విష్ణు ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో మోహన్‌బాబు, ప్రభాస్ మధ్య కన్వర్జేషన్ ఆకట్టుకుంటుంది.
2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి పాకిస్తాన్ జట్టు ముందుగానే నిష్క్రమించింది. బంగ్లాదేశ్‌తో ఈరోజు జరగాల్సిన నామమాత్రపు మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకుందామనుకున్న పాక్.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది. దీంతో.. పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి ఔటయింది. ఈ క్రమంలో.. పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ స్పందించాడు. తమ ప్రదర్శనపై సాకులు వెతకడం లేదని అన్నారు. ఈ టోర్నీలో తమ అభిమానుల అంచనాలను అందుకోలేదని రిజ్వాన్ నిరాశ వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ […]
భారత్-పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై భారత దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ సెంట్రల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలు తిరిగి ప్రారంభించాలంటే సరిహద్దుల్లో శాంతి నెలకొనాలని చెప్పారు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో.. స్వదేశంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో విజయం సాధించనందుకు ఆ దేశ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుండి కోట్ల రూపాయల ప్రైజ్ మనీ పొందనుంది. పాకిస్తాన్‌కు ఐసీసీ నుండి దాదాపు రూ. 2 కోట్ల 37 లక్షల ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈ టోర్నీలో ఏడవ, ఎనిమిదవ స్థానంలో ఉన్న జట్లకు 1.40 లక్షల డాలర్లు అంటే దాదాపు 1 కోటి 22 లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఈ క్రమంలో.. పాకిస్తాన్‌కు ప్రైజ్ మనీ అందుతుది.
న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేయాలని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సూచించాడు. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇవ్వాలని తెలిపాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రావల్పిండి క్రికెట్ స్టేడియంలో టోర్నీలో 9వ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. నిరంతర వర్షం, తడి అవుట్ ఫీల్డ్ కారణంగా టాస్ కూడా పడలేదు. టాస్ పడకముందు నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికీ ఎడతెరిపి ఇవ్వకపోవడంతో అంఫైర్లు మ్యాచ్ రద్దు చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తమ మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌ను మెంటర్‌గా నియమించింది. ఫ్రాంచైజీ ఫిబ్రవరి 27 గురువారం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది.