ఐపీఎల్ (IPL) ఎంతో మంది క్రికెటర్లను స్టార్లు చేసింది. ఐపీఎల్‌లో అడుగుపెట్టకు ముందు వారి జీవితాలు వేరేలా ఉండేవి.. ఒక్కసారి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చి మంచి ప్రదర్శన కనబరిస్తే చాలు.. వారి జీవితం మారిపోయినట్లే.. మనం ఇంతకుముందు కొందరి క్రికెటర్ల జీవితాల గురించి విన్నాం.. ఐపీఎల్ వాళ్లని మార్చేసింది.. ఐపీఎల్ కోటీశ్వరులను చేసింది. అయితే.. ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామని అనుకుంటున్నారా.. సన్ రైజర్స్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ డ్రెస్సింగ్ స్టైల్ గురించి.. అతని డ్రెస్సింగ్ స్టైల్ లక్షల్లో పెట్టి ఖర్చు చేస్తున్నాడు. షర్ట్ దగ్గరి నుంచి మొదలు పెడితే ప్యాంట్ వరకూ అతను ధరించినవన్నీ చాలా కాస్ట్లీవే…..
Read Also: Justice Bela Trivedi: ‘‘ఆమె జైలులోనే ఉండనివ్వండి, బరువు తగ్గుతుంది’’..
ఐదు రోజుల క్రితం ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కాస్ట్లీ డ్రెస్సింగ్ స్టైల్‌తో కనిపించాడు. అతన్ని చూసిన వారంతా బాగున్నాయ్ అంటూ ప్రశంసించారు. చివరకు పాక్ మాజీ దిగ్గజం వసీం అక్రం సైతం అభిషేక్ శర్మ డ్రెస్సింగ్ స్టైల్‌ను అభినందించారు. ఇంతకు అతని ఒంటిపై ఉన్న వస్తువులు ఎంత ధరలు ఉన్నాయో తెలుసుకుందాం…
షర్ట్ ధర: రూ. లక్ష 22 వేలు (పారిస్ లగ్జరీ బ్రాండ్ కాసాబ్లాంకా)
ప్యాంట్ ధర: రూ.లక్ష 59 వేలు (పారిస్ లగ్జరీ బ్రాండ్ కాసాబ్లాంకా)
షూస్ ధర: రూ. లక్ష 30 వేలు (పారిస్ లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్)
వాచ్ ధర: రూ. 9 లక్షల 90 వేలు (స్విట్జర్లాండ్ లగ్జరీ బ్రాండ్ రోలెక్స్ GMT మాస్టర్ II)
మెడలో గోల్డ్ చైన్: 3 తులాలు.. 3 లక్షలు
Read Also: Kedar: 10 మంది మాజీ ఎమ్మెల్యేలకు, 4 నిర్మాతలకు బినామీగా కేదార్?
ఇవన్నీ కలిపితే అభిషేక్ శర్మ ఒంటిపై దాదాపు రూ.20 లక్షలు విలువైనవి ధరించి తిరుగుతున్నాడు. కాగా.. అభిషేక్ డ్రెస్సింగ్ స్టైల్ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కాగా.. గత ఐపీఎల్ సీజన్‌లో సన్ రైజర్స్ తరుఫున అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. చాలా మ్యాచ్‌ల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇతన్ని ఎస్ఆర్‌హెచ్ యాజమన్యం రూ.14 కోట్లు వెచ్చించి మరీ జట్టు దగ్గరే ఉంచుకుంది. మరోవైపు.. యాడ్స్ ద్వారా కూడా అభిషేక్ డబ్బులు సంపాదిస్తున్నాడు.
bro casually wears the annual ctc of half of the cs engineers. 😭 pic.twitter.com/zUafI6PkjG
— Neeche Se Topper (@NeecheSeTopper) February 27, 2025