ఆఫ్ఘన్ జట్టు కోచ్ జోనాథన్ ట్రాట్ ఆస్ట్రేలియాకు ఓ వార్నింగ్ ఇచ్చాడు. 'ఇప్పుడు ఎవరూ ఆఫ్ఘన్ జట్టును తేలికగా తీసుకోరు. గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ అద్భుతంగా రాణించింది. ఇప్పుడు మేము మరింత బలంగా ఉన్నాము. తర్వాత జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ మ్యాచ్ సెమీ ఫైనల్స్ మార్గాన్ని నిర్ణయించే మ్యాచ్ కావడం వల్ల' అని ట్రాట్ పేర్కొన్నాడు.
రోహిత్ శర్మ కెప్టెన్సీ శైలిపై టీమిండియా స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ ప్రశంసలు కురిపించారు. గత కొన్ని సంవత్సరాలుగా రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంతో ఎదిగాడని అన్నారు. రోహిత్ తన సహచరులతో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం టీమిండియాకు మంచి విషయం అని శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డారు.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా.. ఇంగ్లండ్- అఫ్ఘానిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠపోరులో ఇంగ్లండ్ పై ఆఫ్గాన్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. 49.5 ఓవర్లలో ఇంగ్లండ్ ఆలౌటయ్యారు.
సత్యవర్ధన్ కిడ్నాప్ వివాదం కేసులో కీలక ఆధారాలతో వైసీపీ ఓ వీడియో విడుదల చేసింది. వైసీపీ అధికారిక x ఖాతాలో పోస్ట్ చేసింది. ట్రూత్ బాంబ్ పేరిట ఎక్స్‌లో వైసీపీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని, న్యాయవ్యవస్థలను అపహాస్యం చేస్తున్న సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం అంటూ ఆ వీడియోను జత చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుండి పాకిస్తాన్ జట్టు నిష్క్రమించింది. ఈ బాధ నుంచి బయటపడక ముందే జట్టుకు మరో పెద్ద దెబ్బ తగిలింది. మీడియా నివేదికల ప్రకారం.. పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. బుధవారం ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. లాహోర్ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లీష్ బౌలర్లు ఓ ఆట ఆడుకున్నాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కొత్త రికార్డు సృష్టించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడి ఇబ్రహీం ఘనత సాధించాడు. 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 పరుగులు చేశాడు.
హిందూ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన శంభాజీ మహారాజ్ సినిమాను విజయవాడలో మంత్రి సత్యకుమార్ యాదవ్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడున్నరేళ్ళ తరువాత సినిమా చూశానని.. ఒక వీరుడి సినిమా చూశాననే ఆనందం ఉందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్.
ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన కాంగోలో ఓ వింత వ్యాధి హడలెత్తిస్తుంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు 50 మంది మరణించారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన 48 గంటల్లోనే రోగులు మరణిస్తున్నారు. గబ్బిలాలు తిన్న ముగ్గురు పిల్లలలో ఈ వ్యాధి మొదట గుర్తించినట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం వన్డే ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తాజా ర్యాంకింగ్స్‌లో ఒక్కొక్క స్థానం మెరుగుపరచుకున్నారు. కోహ్లీ మళ్ళీ టాప్-5లోకి చేరాడు. 743 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉన్నాడు.
ఆంధ్రప్రదేశ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాల్లో అపశృతి జరిగింది. తమ్మిలేరు వాగులో స్నానాలకు దిగి ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. ఈ ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు గల్లంతయ్యాడు.