R. Ashwin: సీఎస్కేకు తిరిగి రావడంపై ఓపెన్ అయిపోయిన అశ్విన్..
- ఐపీఎల్ 2025లో సీఎస్కే తరఫున ఆడనున్న రవిచంద్రన్ అశ్విన్
- 2009లో సీఎస్కే తరుఫున అశ్విన్ అరంగేట్రం
- చెన్నై సూపర్ కింగ్స్‌కు తిరిగి రావడంపై అశ్విన్ ఓపెన్
- సీఎస్కే జట్టుకు తిరిగి రావడం వింతగా అనిపించింది- అశ్విన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో రవిచంద్రన్ అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరపున ఆడనున్నాడు. కాగా.. 2009లో సీఎస్కే తరుఫున అశ్విన్ అరంగేట్రం చేశాడు. 2015 వరకు ఏడు సీజన్లు చెన్నైకి ఆడాడు. ఆ తర్వాత 2016, 2017లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. 2018లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. ఆ తర్వాత రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. 2022 నుండి 2024 వరకు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. తాజాగా జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అశ్విన్‌ను రూ.9.75 కోట్లకు దక్కించుకుకుంది. ఐపీఎల్‌లో తన కెరీర్ ఎక్కడైతే మొదలుపెట్టాడో.. తిరిగి అక్కడికే వచ్చాడు.
Read Also: Himachal: రాష్ట్ర పథకాలకు “దేవాలయాల” డబ్బులు.. కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ ఆగ్రహం..
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
ఈ క్రమంలో.. చెన్నై సూపర్ కింగ్స్‌కు తిరిగి రావడంపై అశ్విన్ ఓపెన్ అయ్యాడు. 2025లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు తిరిగి రావడం వింతగా అనిపించిందని అన్నాడు. ‘నేను చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వదిలి చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు తిరిగి జట్టులో చేరడం చాలా ప్రత్యేకమైన అనుభూతి. జట్టులో అందరూ ఒకేలా ఉన్నారు, నేనే చాలా సీనియర్‌గా అనిపిస్తోంది. చేపాక్ వేదికపై ఆడటానికి ఎదురు చూస్తున్నాను” అని సీఎస్కే అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో విడుదలైన వీడియోలో అశ్విన్ తెలిపాడు.
Read Also: CM Revanth Reddy: పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది..
చెన్నై తరపున 97 మ్యాచ్‌లలో 6.46 ఎకానమీ రేటుతో 90 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. ఛాంపియన్స్ లీగ్ టీ20లో 24 మ్యాచ్‌లలో 7.44 ఎకానమీ రేటుతో 30 వికెట్లు పడగొట్టాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఓడిపోయిన తర్వాత.. అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉంటే.. సీఎస్కే మార్చి 23న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌ను ఆడుతుంది.
తాజావార్తలు
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!