భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల హవా కొనసాగుతుంది. ఎప్పటికప్పుడూ ఒకదానికొకటి కంటే ఎక్కువ ఫీచర్లు, మైలేజ్, సేఫ్టీ ఫీచర్లు ఉండే కార్లను ఆటోమొబైల్ కంపెనీలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో చైనీస్ ఆటోమొబైల్ కంపెనీ “బెస్ట్యూన్” తన కొత్త చిన్న ఎలక్ట్రిక్ కారును 2023లో విడుదల చేసింది. ఈ కారు లాంచ్ అయిన వెంటనే వార్తల్లోకెక్కింది. దీనికి వెనుక ప్రధాన కారణం.. ఈ కారు ధర చాలా తక్కువ.. అంతేకాకుండా బలమైన శ్రేణి కలిగి ఉండటమే. అలాగే.. కంపెనీ ప్రత్యేకమైన బ్యాటరీ సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇది వేగంగా ఛార్జ్ అవుతుంది.. అధిక దూరం ప్రయాణించగలదు. ఈ టెక్నాలజీతో చైనాలో ఈ కారును “షియోమీ”గా పిలుస్తున్నారు.
AUS vs AFG: ఆసీస్-ఆఫ్గాన్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. సెమీస్‌కు ఆస్ట్రేలియా
బెస్ట్యూన్ షియోమీ ధర 30,000 నుండి 50,000 యువాన్ల మధ్య ఉండగా (సుమారు ₹3.47 లక్షల నుండి ₹5.78 లక్షలు).. ఈ కారు పూర్తి ఛార్జ్ చేస్తే 1200 కిమీ దూరం ప్రయాణించగలదు. ఈ కారు చైనాలో ఉన్న వులింగ్ హాంగ్‌వాంగ్ మినీ EVతో నేరుగా పోటీ పడుతుంది. చైనాలో చిన్న ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్ ఉంది.. ప్రస్తుతం భారత మార్కెట్‌లో కూడా ఈ కారు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం భారత మార్కెట్లో దీనిని లాంచ్ చేయడం సుముఖంగా ఉంటుందని ఆశిస్తున్నారు. ఈ కారు టాటా టియాగో EV, MG కామెట్ EVలతో పోటీ పడుతుంది.
Stomach Pain Reasons: మహిళలకు సాధారణ సమయాల్లో కడుపు నొప్పి వస్తుందా? జాగ్రత్త?
ఈ కారు హార్డ్ టాప్, కన్వర్టిబుల్ వేరియంట్‌లలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం.. హార్డ్ టాప్ వేరియంట్ అమ్మకానికి ఉంది. ఈ కారులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కూడా అందిస్తున్నారు. అలాగే.. ఆకర్షణీయమైన డ్యూయర్ టోన్ థీమ్‌ను పొందుతుంది. Xiaomi ఫోన్ డ్యూయన్ టోన్ కలర్ స్కీమ్ ను కలిగి ఉంటుంది. ఆకర్షణీయమైన ప్రొఫైల్ కోసం పెద్ద హెడ్ ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. ఈ కారుకు ఏరోడైనమిక్ వీల్స్‌ను అందిస్తుంది.. ఇది పరిధిని పెంచడంలో ఉపయోగపడుతుంది. బెస్ట్యూన్ షియోమి FME ప్లాట్‌ఫామ్ పై ఆధారపడి ఉంటుంది. ఇందులో EV, రేంజ్ ఎక్స్ టెండర్ డెడికేటెడ్ ఛాసిస్ ఉన్నాయి. FME ప్లాట్‌ఫామ్ లో రెండు A1, A2 సబ్ ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి. A1 సబ్ ప్లాట్‌ఫామ్ 2700-2850 mm వీల్ బేస్ కలిగిన సబ్ కాంపాక్ట్‌లు, కాంపాక్ట్‌లను అందిస్తుంది. A2ను 2700-3000mm వీల్ బేస్ ఉన్న కార్లకు ఉపయోగిస్తారు. భద్రత పరంగా.. ఈ కారులో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అలాగే ఈ ఈవీకి 3 డోర్లు ఉన్నాయి. బెస్ట్యూన్ షియోమి పొడవు 3000mm, వెడల్పు 1510 mm, ఎత్తు 1630 mm కలిగి ఉంటుంది.