ఓ పోష్ అమ్మాయితో డేటింగ్ చేసిన యువకుడు భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు. అందమైన అమ్మాయి కదా.. పెళ్లి చేసుకుందామని అనుకున్న యువకులు అడ్డంగా బుక్కయ్యారు. డేటింగ్ యాప్ మాయలో పడి రూ.28 లక్షలు పోగొట్టుకున్నాడు వైజాగ్ కు చెందిన ఓ వ్యక్తి. ఇన్స్టాగ్రాంలో సైబర్ ముఠా వల విసిరింది. డేటింగ్, ప్రేమ, పెళ్లి యవ్వారం చాలా దూరం వెళ్లే సరికి అవతల నుంచి ఓ అమ్మాయి లైన్లోకి వచ్చింది. అవసరాలు పేరుతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.28 లక్షలు నొక్కేసింది.
కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లోని లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ను రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. వేగ పరిమితిని ఉల్లంఘించి వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసారు. ఆగ్రా రైల్వే డివిజన్‌లోని మధుర రైల్వే డివిజన్‌కు చెందిన లోకో పైలట్ గంటకు 20 కి.మీ వేగంతో రైలును నడపాలన్న ఆర్డర్‌ను మరచిపోయాడు.
తమిళనాడులోని ఆవడి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF)లో సెక్యూరిటీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన సర్వీస్ వెపన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మైలాడుతురై జిల్లా ముట్టపుదుపేట్‌కు చెందిన కాళిదాస్ (55)గా గుర్తించారు. అతనికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటన జూలై 24వ తేదీ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది.
ప్రధాని మోడీపై ఎంపీ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగుపడిందన్నారు. ఇప్పుడు మనం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పదేళ్ల క్రితం దేశ ఆర్థిక వ్యవస్థపై అందరూ ఆందోళన చెందేవారని కంగనా పేర్కొన్నారు.
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో 49 ఏళ్ల స్కూల్ బస్సు డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన సురక్షితంగా ఆపి సుమారు 20 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడాడు. అనంతరం.. కొద్దిసేపటికే అతను కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు ప్రకటించారు.
మహిళల ఆసియా కప్లో భాగంగా.. ఈరోజు బంగ్లాదేశ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. 81 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఓపెనర్లు కేవలం 11 ఓవర్లలోనే ఛేదించారు. భారత్ ఓపెనర్లు స్మృతి మంధాన (55*), షఫాలీ వర్మ (26*) పరుగులు చేశారు. దీంతో.. భారత జట్లు ఫైనల్స్లోకి ప్రవేశించింది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అనాగరికంగా అభివర్ణించారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను జాతి నిర్మూలన చర్య అని తెలిపారు. ఇజ్రాయెల్ అనాగరికతకు అనేక పాశ్చాత్య దేశాలు మద్దతు పలకడం సిగ్గుచేటని ప్రియాంక ఆరోపించారు.
దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. క్యాన్సర్ రోగులకు ధర.. చికిత్స అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. శుక్రవారం లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన.. ప్రతి సంవత్సరం క్యాన్సర్ రోగుల సంఖ్య 2.5 శాతం చొప్పున పెరుగుతోందన్నారు. పురుషులలో నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. ఎక్కువ మంది మహిళలు రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారని.. ఏటా 15.5 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని జేపీ నడ్డా తెలిపారు.
కర్ణాటకలో మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరంతరం ఇరుకున పెడుతోన్న బీజేపీపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శుక్రవారం పలు ఆరోపణలు చేశారు. అవినీతిలో బీజేపీయే అగ్రగామి అని డీకే శివకుమార్ అన్నారు. ఇప్పుడు వారు చేసిన మోసాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్‌పై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులను ఒక మహిళ చూసినట్లు నివేదించడంతో జమ్మూలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో.. ముందుజాగ్రత్తగా జమ్మూలోని ఆర్మీ పాఠశాలలను శనివారం వరకు మూసివేయనున్నారు. భద్రతను నిర్ధారించడానికి కీలకమైన ఆర్మీ మరియు డిఫెన్స్ ఇన్‌స్టాలేషన్‌ల వద్ద భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. పంజాబ్ పోలీసులు వారిని వెతికి పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.