Priyanka Gandhi: గాజాపై ఇజ్రాయెల్ చర్యలను ఖండించిన ప్రియాంక గాంధీ..
- గాజాపై ఇజ్రాయెల్ చర్యలను ఖండించిన ప్రియాంక గాంధీ
- గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను జాతి నిర్మూలన చర్య- ప్రియాంక గాంధీ
- ఇజ్రాయెల్ అనాగరికతకు అనేక పాశ్చాత్య దేశాలు మద్దతు పలకడం సిగ్గుచేటు- ప్రియాంక గాంధీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అనాగరికంగా అభివర్ణించారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను జాతి నిర్మూలన చర్య అని తెలిపారు. ఇజ్రాయెల్ అనాగరికతకు అనేక పాశ్చాత్య దేశాలు మద్దతు పలకడం సిగ్గుచేటని ప్రియాంక ఆరోపించారు. గాజాలో కొనసాగుతున్న సైనిక చర్యను ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలు తీవ్రంగా ఖండించాలని ఆమె కోరారు. గాజాలో ప్రతిరోజూ అమాయక పిల్లలు, మహిళలు, వృద్ధులు, వైద్యులు, జర్నలిస్టులు హత్యకు గురవుతున్నారని ప్రియాంక తెలిపారు.
Blue Light: మీ ఫోన్ నుంచి వచ్చే నీలి కాంతి మీ చర్మానికి హాని కలిగిస్తుంది..
Also Read
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
ప్రియాంక గాంధీ.. సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూపై మండిపడ్డారు. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బుధవారం యుఎస్ కాంగ్రెస్ ఉమ్మడి సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగించిన అనంతరం ఉభయ సభల ఎంపీలు లేచి నిలబడి ఆయనకు చప్పట్లు కొట్టారు. అదే సమయంలో.. కొందరు నాయకులు ఇజ్రాయెల్ ప్రధాని ప్రసంగాన్ని చారిత్రాత్మకంగా అభివర్ణించారు. ఈ క్రమంలో.. అమెరికా నేతల తీరుపై ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. మానవత్వం, నాగరికతపై నమ్మకం ఉన్నవారు ఇలా చేసి ఉండరని అమెరికా నేతలను ఉద్దేశించి దుయ్యబట్టారు.
Zakia Khanam: వైసీపీకి మరో బిగ్ షాక్..! లోకేష్‌ను కలిసిన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్
ఇంతకుముందు కూడా.. ప్రియాంక గాంధీ ఇజ్రాయెల్-హమాస్‌పై స్పందించారు. ఇదిలా ఉంటే.. యుద్ధం కారణంగా ప్రపంచం రెండు భాగాలుగా విడిపోయింది. ఇజ్రాయెల్, హమాస్ గురించి ప్రపంచం రెండు భాగాలుగా విభజించబడింది. ఒకవైపు చాలా పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తుండగా, మరోవైపు మధ్య ఆసియాలోని ఇరాన్ వంటి దేశాలు పాలస్తీనాకు మద్దతు పలుకుతున్నాయి. ఈ యుద్ధంలో గాజా ప్రజలు అతిపెద్ద మూల్యాన్ని చెల్లిస్తున్నారు. గాజాలోని వివిధ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ నిరంతరం సైనిక చర్య తీసుకుంటోంది. ఈ సైనిక చర్యలో చాలా మంది అమాయకులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మృతి చెందిన వారిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. ప్రతిరోజూ గాజా నుండి చిన్న పిల్లల మరణ చిత్రాలు వెలువడుతున్నాయి. ఇది ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అయితే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్ నిర్మూలన వరకు యుద్ధం కొనసాగుతుందని స్పష్టంగా చెప్పారు.
తాజావార్తలు
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
ట్రెండింగ్
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?