ప్రధాని మోడీపై ఎంపీ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగుపడిందన్నారు. ఇప్పుడు మనం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పదేళ్ల క్రితం దేశ ఆర్థిక వ్యవస్థపై అందరూ ఆందోళన చెందేవారని కంగనా పేర్కొన్నారు. కానీ ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
LIC HFL 2024: నిరుద్యోగులకు ఎల్ఐసి శుభవార్త.. భారీగా జీతం..
లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ.. “నేను ఈ పార్లమెంటుకు కొత్త సభ్యురాలిని, కానీ ఇటీవలి ఎన్నికల ప్రాముఖ్యత గురించి నాకు బాగా తెలుసు. మోడీ వరుసగా మూడుసార్లు గెలిచి రికార్డులు బద్దలు కొట్టారు.” పదేళ్ల క్రితం మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలుసునని.. దేశం మొత్తం ఆందోళన చెందిందని.. అయితే 11వ స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుని ఇప్పుడు మూడో స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.” అన్నారు. అంతేకాకుండా.. తన ప్రసంగంలో తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ సవాళ్లను కూడా ప్రస్తావించారు. జీరో అవర్‌లో హిమాచల్ ప్రదేశ్‌లో వరద సంక్షోభంపై కంగనా రనౌత్ సభలో ఆందోళన వ్యక్తం చేశారు. “గత ఏడాది పెద్ద వరదలు ఎదుర్కొన్నాం. కానీ నిరాశ కలిగించే విషయం ఏమిటంటే.. హిమాచల్ ప్రదేశ్ ఇప్పటి వరకు కోలుకోలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి కొనసాగుతోంది.” అని తెలిపారు.
Bengaluru: హాస్టల్‌లో యువతి హత్య.. సీసీకెమెరాలో రికార్డ్
అంతకు ముందు ఆరు దశాబ్దాల్లో చేసిన పని కంటే.. గత 10 ఏళ్లలో చేసిన పని చాలా ఎక్కువ అని కంగనా రనౌత్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న కొన్ని రోడ్లు కూడా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో నిర్మించారని.. ఇప్పుడు తమ రాష్ట్రంలో ఎయిమ్స్, ఐఐఐటీ తదితర ప్రపంచ ప్రమాణాలతో కూడిన ఇన్‌స్టిట్యూట్‌లు ఏర్పాటయ్యాయని తెలిపారు. “మన హిమాచల్ ప్రదేశ్ బహిరంగ మలవిసర్జన నుండి విముక్తి పొందింది.. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉంది” అని కంగనా రనౌత్ తన రాష్ట్ర విజయాలను సగర్వంగా చెప్పింది. మండిలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని.. పర్యాటకాన్ని పెంచాలని ఆమె కోరారు.