రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్.. ఆదివారం పారిస్ ఒలింపిక్స్‌ను ఘనంగా ప్రారంభించింది. మహిళల 50 కేజీల ఒలింపిక్స్‌లో జర్మనీ క్రీడాకారిణి మ్యాక్సీ కరీనా క్లోట్జర్‌పై విజయం సాధించి జరీన్ ప్రిక్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించింది. నార్త్ ప్యారిస్ ఎరీనాలో జరిగిన చివరి 32 రౌండ్‌లో 28 ఏళ్ల అన్‌సీడెడ్ బాక్సర్ జర్మన్ బాక్సర్‌పై 5-0తో గెలిచింది.
చంద్రబాబు శ్వేతపత్రాలు, జగన్ ప్రకటనలతో ప్రజలు అయోమయంలో ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఏ రంగంలో దేశ అభివృద్ధి జరిగిందో సీనియర్ నాయకుడు చంద్రబాబు చెప్పాలని అన్నారు.
ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్లో భారత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది టీమిండియా. భారత్ బ్యాటింగ్లో స్మృతి మంధాన (60) హాఫ్ సెంచరీతో అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. మంధాన ఇన్నింగ్స్ లో 47 బంతుల్లో 60 రన్స్ చేయగా.. అందులో 10 ఫోర్లు ఉన్నాయి. దీంతో.. శ్రీలంక ముందు 166 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం ఊడిముడి వద్ద పడవ ప్రమాదం జరిగింది. వరద ప్రభావిత లంక గ్రామాలకు పడవలో వాటర్ ప్యాకెట్లు తీసుకెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో పడవలో ఆరుగురు ప్రయాణిస్తుండగా వరద ప్రవాహానికి పడవ బోల్తా పడింది. అందులో ఉన్న ఐదుగురిని స్థానిక మత్స్యకారులు నాటు పడవలో వెళ్లి రక్షించగా.. ఒకరు గల్లంతు అయ్యారు.
ఏపీలో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగుల్చాయి. మరోవైపు.. లంక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అల్లూరు జిల్లాలో వర్షాల జోరు తగ్గలేదు. దీంతో.. వాగులు, వంకలు ఉధృతంగా ఉప్పోంగుతున్నాయి. ముంచంగిపుట్టు మండల పరిధిలో భారీ వర్షాలకు లక్ష్మీపురం పంచాయితీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కాసేపట్లో భారత్-శ్రీలంక మధ్య ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంకలోని దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించి ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. పాకిస్తాన్ పై శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 141 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించింది.
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో విషాదం చోటు చేసుకుంది. గోరఖ్‌పూర్ నుంచి పూణే వెళ్తున్న పూణె వీక్లీ ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లోని ప్రయాణికులపై వేడి వేడి 'టీ' పడటంతో గందరగోళం నెలకొంది. ముగ్గురు ప్రయాణీకులపై టీ పడటంతో.. వారు ప్రయాణించే కోచ్ అల్లకల్లోలం అయింది. తమపై 'టీ' పడటంతో చాలా ఇబ్బందిగా, నొప్పిగి ఉందంటూ.. కోచ్ లో నెట్టడం, లాగడం చేశారు. ఈ గందరగోళంలో డోర్ వద్ద కూర్చున్న ఇద్దరు ప్రయాణికులకు తగలడంతో కదులుతున్న రైలు నుండి జారి పడిపోయారు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో పర్యటించారు. సుల్తాన్‌పూర్ సివిల్ కోర్టు నుండి లక్నోకు వెళుతుండగా.. రాహుల్ గాంధీ కాన్వాయ్ గుప్తర్‌గంజ్‌లోని ఎమ్మెల్యే నగర్‌లోని ఓ చెప్పుల కొట్టు వద్ద ఆగారు. రాహుల్ గాంధీ ఆ కొట్టులో కూర్చుని చెప్పులు కుడుతున్న వ్యక్తితో మాట్లాడారు.
రేపు ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొననున్నారు. ఇండియా కూటమికి చెందిన ఇతర ముఖ్యమంత్రుల మాదిరిగానే ఆమె కూడా సమావేశానికి హాజరుకాకుండా ఉంటారా అనే సస్పెన్స్ కు తెర తీసింది. ఈ క్రమంలో.. నీతిఆయోగ్ సమావేశానికి హాజరవడం కోసం శుక్రవారం ఆమె కలకత్తా నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.