మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు శరీరానికి సరైన మోతాదులో ప్రొటీన్లు అవసరం. అంతేకాదు.. మంచి డైట్ కూడా పాటించాలి. శరీరంలో కణాలు.. కండరాలను నిర్మించడంలో ప్రొటీన్లు సహాయపడుతుంది. ప్రొటీన్లు.. దంతాల నుంచి మొదలుపెడితే గోర్లు వరకు అవసరం. ప్రొటీన్లు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.. అంతేకాకుండా.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే మన ఆహారంలో ప్రొటీన్లు అవసరం. అయితే.. మాంసం, గుడ్లు, చేపల్లో ఎక్కువగా ప్రొటీన్లు ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే నాన్ వెజ్ తిననివారి కోసం వారు మాంసాహారం ద్వారా ఏవైతే కోల్పోతున్నారో…
జూలై 27 నుంచి భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు పల్లెకెలెలో జరగనున్నాయి. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా జెర్సీలో భారీ మార్పు జరిగింది. ఇప్పటికే శ్రీలంక చేరుకున్న టీమిండియా.. నెట్స్ ప్రాక్టీస్లో దూకుడు పెంచారు. సూర్యకుమార్ యాదవ్ బృందం ఆతిథ్య జట్టుతో తలపడనుంది. సిరీస్ ఆరంభానికి రెండు రోజులు ఉందనగా భారత ఆటగాళ్లు కొత్త జెర్సీలతో ఫొటోలకు పోజిచ్చారు.
గుజరాత్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. వడోదరలో 13.5 మి.మీ వర్షం కురిసింది. దీంతో నగరం మొత్తం భారీ వరదలతో ముంచెత్తింది. మరోవైపు.. విశ్వామిత్ర నది ప్రమాదకర స్థాయిని దాటింది. విశ్వామిత్ర నది నీటిమట్టం పెరగడంతో మొసళ్లు బయటకు వస్తున్నాయి. ఎగువ నది నుంచి విడుదలవుతున్న నీటి కారణంగా విశ్వామిత్ర నదికి వరద పోటెత్తింది. నది మట్టం ప్రమాద స్థాయిని దాటి 27.85 అడుగులకు చేరుకుంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పూణెలోని లావాసా నగరంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మూడు ఇళ్లు కూలిపోయాయి. అంతేకాకుండా.. ఓ యువకుడు మృతి చెందాడు. కాగా కొండచరియలు విరిగిపడిన శిథిలాల కింద ఇద్దరు చిక్కుకున్నారు. వర్షం కారణంగా పూణె, థానేలో వరదలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.. డ్యామ్‌లలో నీటిమట్టం పెరిగింది. వర్షం కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో.. ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ప్రజలను రక్షించే పనిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం నిమగ్నమై ఉన్నాయి.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త డిజైన్‌తో కర్వ్ ఈవీని రూపొందించింది. టాటా కర్వ్ ఎలక్ట్రికల్ వెహికల్ (EV)ను వచ్చే నెల (ఆగస్ట్ 7)న విడుదల చేయనున్నారు. ఈ కారు ఇంటీరియర్.. కొత్త ఎలక్ట్రిక్ కూపే SUV దాని అండర్‌పిన్నింగ్‌లను నెక్సాన్‌తో పంచుకుంటుంది. ఇంటీరియర్ దాని సబ్‌కాంపాక్ట్ మాదిరిగానే కనిపిస్తుంది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు ఉంటాయి.
పశ్చిమ ఆస్ట్రేలియాలో గురువారం రెండు హెలికాప్టర్ల ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయన్న సమాచారం తెలియాల్సి ఉంది. కాగా.. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రెండు హెలికాప్టర్లలో ఇద్దరు పైలట్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత మహిళల ఆర్చరీ జట్టు శుభారంభాన్ని అందించింది. దీంతో.. క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. భజన కౌర్, దీపిక కుమారిలతో పాటు అంకిత భకత్ అద్భుత ప్రదర్శన చేయడంతో భారత్ టాప్-4లో నిలిచింది. ఈ ముగ్గురు ఆర్చర్లు కలిసి 1983 పాయింట్లు సాధించారు. అంకిత భకత్ (666) పాయింట్లు చేసింది. భజన్ కౌర్ (659), దీపికా కుమారి (658) పాయింట్లు సాధించింది. వ్యక్తిగత విభాగంలో అంకిత తృటిలో టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయింది.
ఈ సంవత్సరం కనీసం 2,694 విమానాలకు సంబంధించిన సంఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటనల కారణంగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 697 మంది చనిపోయారు. ASN ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు.. భద్రతా సమస్యలపై సమాచారాన్ని అందజేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 23న మలేషియా నౌకాదళానికి చెందిన రెండు విమానాలు (యూరోకాప్టర్ AS 555SN ఫెన్నెక్ M502-6 మరియు అగస్టావెస్ట్‌ల్యాండ్ AW139 M503-3) ప్రమాదానికి గురయ్యాయి.
గత కొన్ని రోజులుగా దేశంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమోటాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. టమోటా, ఉల్లి, బంగాళదుంప వంటి నిత్యావసర కూరగాయల రిటైల్ ధరలు.. 15 శాతం నుంచి 58 శాతానికి పెరిగాయి. అందుకు కారణం వర్షం ప్రభావంతో పాటు.. ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి తాత్కాలికమేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రానున్న రోజుల్లో ధరలు అదుపులోకి రానున్నాయని తెలిపింది. అయితే కూరగాయల ధరలు ఎందుకు వేగంగా పెరుగుతున్నాయి? దీని వెనుక ప్రభుత్వం ఏం చెప్పిందో…
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో అమెరికా మహిళపై అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగు చూసింది. పెళ్లయిన ఓ లాయర్ అమెరికాకు చెందిన అమ్మాయితో ఫేస్‌బుక్‌లో స్నేహం చేశాడు. తనకు పెళ్లికాలేదని యువతిని భారత్‌కు రప్పించాడు. జైపూర్, అజ్మీర్ సహా పలు చోట్ల హోటళ్లలో యువతికి సౌకర్యం కల్పించాడు. ఈ క్రమంలో అమెరికా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. దానికి ఆ వ్యక్తి అబద్ధపు మాటలు చెబుతూ వచ్చాడని యువతి తెలిపింది.