రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖలో పరిస్థితులు, మదనపల్లి ఫైల్స్ దగ్దం ఘటన లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అంతేకాకుండా.. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై సమావేశంలో ప్రస్తావించారు. భూ యజమానులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.
బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. రాజకీయాలకు కొత్త కాదు కానీ.. సభకు మాత్రమే కొత్తని అన్నారు. సభకు కొత్తగా 50మంది ఎమ్మెల్యేలం వచ్చాం.. కొత్త సభ్యులు సీనియర్ సభ్యుల నుంచి నేర్చుకునేలా సభ ఉండాలని తెలిపారు. సభ తీరు చూస్తుంటే విమర్శలు, ప్రతి విమర్శలకే సరిపోతుందని ఆయన ఆరోపించారు.
వరద గోదారమ్మ పోటెత్తడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి ముప్పు పొంచి ఉంది. ఆదివారం సాయంత్రానికి ఆ గ్రామం చుట్టూ వరద నీరు చేరింది. అనేక పల్లపు ప్రాంతాల్లో వందలాది ఎకరాల పంటలు ముంపుకు గురయ్యాయి. అయితే ఈ వరద నీరు మరింత పెరిగితే ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోతాయి. ఎగువ ప్రాంతంలో వరదనీటి ఉదృతి తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతానికి ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో9 వికెట్లు కోల్పోయి భారత్ 161 పరుగులు చేసింది. భారత్ ముందు 162 పరుగుల ఫైటింగ్ టార్గెట్ ను ముందుంచారు.
ప్రకాశం జిల్లాలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి తృటిలో ప్రమాదం తప్పింది. జరుగుమల్లి మండలం పాలేటిపాడులో పోలేరమ్మ తిరుణాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి.. తిరుణాల సందర్భంగా టీడీపీ నాయకులు కొనుగోలు చేసిన నూతన ఎడ్ల బండిని ప్రారంభిస్తుండగా డీజే సౌండ్లకు బెదిరి ఎద్దులు మంత్రిని ఢీకొన్నాయి.
అంబేద్కర్ కోసం జిల్లా గంటి పెదపూడి పడవ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. పడవ ప్రమాదంలో గల్లంతైన బాధ్యత కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. నదిలో వరద ఉధృతి తగ్గేంత వరకు లంక గ్రామాల ప్రజలు, గోదావరి పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.
ఇండియా-శ్రీలంక జట్ల మధ్య 3 టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. ఈరోజు రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకుంది.
ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సులు, రవాణా శాఖలో పలు అంశాలపై రేపు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు దిశగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. తెలంగాణ, కర్ణాటకలలో ఫ్రీ బస్సుల అమలును అధ్యయనం చేసే దిశగా నిర్ణయించే అవకాశం ఉంది.
ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్లో భారత్ పై శ్రీలంక విజయం సాధించింది. దీంతో.. ఆసియా కప్ 2024 విజేతగా శ్రీలంక మహిళల జట్టు అవతరించింది. 166 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది శ్రీలంక ఉమెన్స్.
సంక్షోభం నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ఇందుకు లైన్ మెన్ రామయ్య చేసిన సాహసమే ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన కొనియాడారు. ప్రజావసరాలను తీర్చడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మరోసారి నిరూపించామని చెప్పారు.