Online Dating Fraud: ఆన్లైన్లో అమ్మాయిలతో డేటింగ్.. అడ్డంగా బుక్కైన యువకులు
- డేటింగ్ యాప్ మాయలో పడి రూ. 28లక్షలు పోగొట్టుకున్న వైజాగ్ టెకీ
- ఫేక్ ఇన్ స్టాగ్రాంలో ఫేక్ ఐడీతో పరిచయం అయిన మయగాళ్ళు
- వాట్సప్ చాటింగ్ తో డేటింగ్ ముగ్గులోకి దింపి టోకరా
- ఫేస్ బుక్ లో దినేష్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నుంచి రూ. 21 లక్షల కాజేత
- సాయి ప్రియ అనే మహిళను అరెస్టు చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోసం చేయడానికి కాదేది అనర్హం అన్న చందంగా మారారు. ఎక్కడ చూసినా దోపిడీలు, సైబర్ నేరాలు, దొంగతనాలు ఇలా నేరం ఏదైనా రూటు మార్చుకొని చివరకు అమాయకులనే మోసం చేస్తున్నారు. ఎన్ని కేసులు విధించినా చేసే పని చేసుకుంటూనే వెళ్తున్నారు. తాజాగా ఒక కొత్త రకమైన దోపడీ వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్ పేరుతో అమాయక అబ్బాయిలను మోసం చేస్తున్నారు అమ్మాయిలు. డేటింగ్ యాప్స్ ను డౌన్‌లోడ్ చేసుకుని రిజిష్టర్ చేసుకుంటున్న యూత్ అందంగా ఉన్న యువతులకు రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. టెక్కీలైతే వెంటనే యాక్సెప్టెన్సీ వస్తోంది. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. రోజూ చాట్ చేస్తూ ముగ్గులోకి దింపుతున్నారు. రకరకాల కథలు చెబుతూ లక్షల్లో దోచుకుంటున్నారు. వీటి వెనక ఉన్న ముఠాలు అమ్మాయిలను పంపుతామంటూ ముందుగా మనీ ట్రాన్స్‌ఫర్ చేయించుకుని చీట్ చేస్తున్నాయి. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని కంప్లయింట్ ఇవ్వడానికి ఎవరూ సాహసించడం లేదు.
Payyavula Keshav: రాజకీయ హత్యలపై దమ్ముంటే వివరాలు బయటపెట్టండి..!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజాగా.. ఓ పోష్ అమ్మాయితో డేటింగ్ చేసిన యువకుడు భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు. అందమైన అమ్మాయి కదా.. పెళ్లి చేసుకుందామని అనుకున్న యువకులు అడ్డంగా బుక్కయ్యారు. డేటింగ్ యాప్ మాయలో పడి రూ.28 లక్షలు పోగొట్టుకున్నాడు వైజాగ్ కు చెందిన ఓ వ్యక్తి. ఇన్స్టాగ్రాంలో సైబర్ ముఠా వల విసిరింది. డేటింగ్, ప్రేమ, పెళ్లి యవ్వారం చాలా దూరం వెళ్లే సరికి అవతల నుంచి ఓ అమ్మాయి లైన్లోకి వచ్చింది. అవసరాలు పేరుతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.28 లక్షలు నొక్కేసింది. డబ్బులు పోయి మబ్బులు తొలిగే సరికి మోసపోయానని గుర్తించాడు ఆ బ్యాచిలర్. ఆ తర్వాత.. సైబర్ పోలీసుల్ని ఆశ్రయిస్తే మోసగాళ్ళు హైదరాబాద్ కేంద్రంగా ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించారు. విశాఖకు చెందిన కృష్ణ మనోజ్ ఇంజనీర్ ను మోసం చేసినది సాయి ధీరజ్, లోకేష్, శాలినిగా గుర్తించారు. ఈ ముఠా అతని వద్ద నుంచి రూ. 28 లక్షల కాజేసినట్టు నిర్దారణ అయ్యింది. కాగా.. ఈ కేసులో లోకేష్ ను అరెస్టు చేయగా మిగిలిన ఇద్దరు పరారీలో వున్నారు. మరోవైపు.. ఫేస్ బుక్లో దినేష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్తో పరిచయం పెంచుకున్న సాయి ప్రియ అనే మహిళ.. అతని వద్ద నుంచి రూ. 21 లక్షలు కాజేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలో.. ఈ రెండు కేసులను విశాఖ సైబర్ పోలీసులు ఛేదించారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!