జేమ్స్ కామెరూన్ రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ఈ సినిమాపై క్రేజ్ రోజురోజుకీ పెరుగుతుండగా, అడ్వాన్స్ బుకింగ్స్, ఆన్‌లైన్ ట్రెండ్స్, ప్రేక్షకుల స్పందన ఈ చిత్రాన్ని అతిపెద్ద సినిమాటిక్ ఈవెంట్‌గా నిలబెడుతున్నాయి. ఇప్పటికే ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ జేమ్స్ కామెరూన్‌తో ప్రత్యేక చర్చ జరిపిన విషయం తెలిసిందే. తాజాగా ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ కూడా ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Also Read : Vidyabalan : సౌత్ ఇండస్ట్రీలో సెలెక్టివ్‌గా అడుగులు వేస్తున్న విద్యాబాలన్
సినిమా చూసిన అనంతరం సుకుమార్ మాట్లాడుతూ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఒక అబ్సల్యూట్ బ్లాక్‌బస్టర్ అని పేర్కొన్నారు. గ్రాండ్ విజువల్స్ మాత్రమే కాకుండా, కథతో పాటు సినిమాలోని బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను తాకుతాయని, ఎపిక్ స్కేల్‌లో కథను చెప్పడంలో జేమ్స్ కామెరూన్ మరోసారి తన సిగ్నేచర్ స్టైల్‌ను చూపించారని, ఈ చిత్రం కేవలం ఒక సినిమా కాదని, ఇది ఒక ఈవెంట్ ఫిల్మ్ అని, కుటుంబ సమేతంగా థియేటర్‌లో చూసినప్పుడే పూర్తి అనుభూతి లభిస్తుందని’ అన్నారు. ఇండియన్ సినిమా లవర్స్ ‘అవతార్’ ఫ్రాంచైజ్ పై చూపిస్తున్న ఆదరణ చూస్తే ఈ సిరీస్ పలు రికార్డులు బద్దలు కొట్టేలా ఉంది. కాగా ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఒక తరం మొత్తం గుర్తుంచుకునే గొప్ప సినిమాటిక్ అనుభూతిగా నిలవనుంది. 20th సెంచరీ స్టూడియోస్ సమర్పిస్తున్న ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్రం డిసెంబర్ 19న భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.