Railway: వేగ పరిమితి ఉల్లంఘన.. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ సస్పెండ్
- వేగ పరిమితి ఉల్లంఘించిన సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్.. అసిస్టెంట్ లోకో పైలట్
- వారిని సస్పెండ్ చేసిన రైల్వే అధికారులు
- లోకో పైలట్ గంటకు 20 కి.మీ వేగంతో రైలును నడపాలని ఆర్డర్
- అది మరిచిపోయి పూర్తి వేగంతో రైలును నడిపిన లోకో పైలట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లోని లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ను రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. వేగ పరిమితిని ఉల్లంఘించి వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసారు. ఆగ్రా రైల్వే డివిజన్‌లోని మధుర రైల్వే డివిజన్‌కు చెందిన లోకో పైలట్ గంటకు 20 కి.మీ వేగంతో రైలును నడపాలన్న ఆర్డర్‌ను మరచిపోయాడు. ఈ రైల్వే విభాగంలో అతను పూర్తి వేగంతో రైలును నడపాడు. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఇద్దరు లోకో పైలట్లను సస్పెండ్ చేశారు.
Read Also: Karnataka: రామనగర్ జిల్లా పేరు మార్పునకు కేబినెట్ నిర్ణయం.. కొత్త పేరు ఇదే!
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
సమాచారం ప్రకారం.. రైల్వే ట్రాక్, ట్రాక్ మరమ్మతులు, పాత రైల్వే వంతెన.. స్టేషన్ యార్డ్ పునర్నిర్మాణం యొక్క పరిస్థితి కోసం మథుర రైల్వే సెక్షన్‌లో రైల్వే వేగ నియంత్రణను విధించింది. ఈ క్రమంలో.. రైలు గంటకు 20 కి.మీ వేగంతో ఈ ట్రాక్ గుండా వెళ్లాల్సి ఉంది. కాగా.. కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లోని లోకో పైలట్ వేగ పరిమితిని మర్చిపోయాడు. అతను ట్రాక్‌పై పూర్తి వేగంతో రైలును దాటాడు. దీంతో రైలులో ప్రయాణిస్తున్న వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. ఆగ్రా డివిజన్‌కు చెందిన పిఆర్‌ఓ ప్రశస్తి శ్రీవాస్తవ మాట్లాడుతూ.. విషయం గురించి సమాచారం అందుకున్న తరువాత.. ఇద్దరు లోకో పైలట్‌లపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇద్దరినీ తక్షణమే సస్పెండ్ చేశామన్నారు.
Read Also: Renu Desai: మంత్రి కొండా సురేఖను కలిసిన ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్
ఆగ్రా రైల్వే డివిజన్‌లో గత రెండు నెలల్లో మూడోసారి ఈ ఘటన చోటుచేసుకుంది. అంతకుముందు 2024 మేలో.. మాల్వా మరియు గతిమాన్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లు ఆగ్రా రైల్వే సెక్షన్‌లోనే వేగ పరిమితిని ఉల్లంఘించారు. డ్రైవర్ల పరిమితి గంటకు 20 కి.మీ కాకుండా, రైలు గంటకు 120 కి.మీ వేగంతో నడిపారు. కాగా.. లోకో పైలట్లు కొంత ఒత్తిడికి లోనవుతున్నట్లు ఆగ్రా రైల్వే డివిజన్‌లో పదేపదే జరుగుతున్న ఇలాంటి ఘటనలను బట్టి స్పష్టమవుతోంది. ఈ నిరంతర పొరపాటు వల్ల ఏదైనా పెద్ద ప్రమాదం జరగకముందే రైల్వే బోర్డు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని విచారణ బృందాన్ని పంపాలని రైల్వే అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!