గత ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల పై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. 'పాస్ పుస్తకాలపై తన బొమ్మవేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడిన గత పాలకుడి తప్పుల్ని సరిదిద్దుతున్నామన్నారు. తాత తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులపై ఎవరి బొమ్మ ఉండకూడదనేది ప్రజాభిప్రాయం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తామని తెలిపారు. నాటి అహంకార, పెత్తందారీ పోకడలు ప్రజాప్రభుత్వంలో ఉండవు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడి వారి ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతను మా ప్రభుత్వం…
హౌసింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ రివ్యూలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కొత్త లబ్దిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వచ్చే నెల (ఆగష్టు)2వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఆగస్ట్ 2న ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. భేటీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
పోలీసింగ్ కోసం సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. ఈ క్రమంలో ఇ-పహారా అప్లికేషన్ ను పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు ప్రారంభించారు.
హర్యానాకు చెందిన 22 ఏళ్ల యువకుడు ఉక్రెయిన్‌లో మరణించాడు. రష్యా తరపున ఉక్రెయిన్‌లో యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయాడు. ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన తన తమ్ముడిని బలవంతంగా సైన్యంలోకి చేర్చుకున్నారని మృతుడి సోదరుడు చెబుతున్నాడు. యువకుడికి కొన్ని రోజుల శిక్షణ ఇచ్చిన తర్వాత.. ఉక్రెయిన్‌కు ఫ్రంట్‌లైన్ వర్కర్‌గా పంపించారు. అక్కడ ఆ యువకుడు పోరాడుతూ మరణించాడు. యువకుడి మృతిని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది.
పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో భారత మహిళా షూటర్ రమితా జిందాల్ పతకాన్ని కోల్పోయింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్‌లో రమితా జిందాల్ ఏడో స్థానంలో నిలిచింది.
సీఎం చంద్రబాబు చేపట్టిన రెవెన్యూ సమీక్షలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల పాసు పుస్తకాలపై తన బొమ్మల కోసం రూ.15 కోట్లు తగలేశారంటూ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు, ప్రజల కోరిక మేరకు రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు ఇచ్చేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది.
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో కొందరు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. పాత ఆర్డీవో మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీశైలం జలాశయం గేట్లను అధికారులు కాసేపటి క్రితం ఎత్తేశారు. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో డ్యాం గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. 3 గేట్లు ఎత్తి 80 వేల క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో రూపంలో 4.67,210 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
ఆంధ్రప్రదేశ్లో సెక్రటేరియట్, హెచ్వోడీలుగా పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి హెచ్ఆర్ఏ (HRA)ను పెంచింది. ప్రస్తుతం 16 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏను 24 శాతానికి పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బేసిక్ పేపై 24 శాతం హెచ్ఆర్ఏ పెంచారు. రూ.25 వేలకు మించకుండా పెంచిన హెచ్ఆర్ఏ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది.