వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆహారం విషయంలో తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈసారి వెజ్‌కి బదులు నాన్‌వెజ్ ఫుడ్ ఇవ్వడంతో ఓ ప్రయాణికుడు వెయిటర్‌పై చిరుబుర్రులాడాడు. అంతేకాకుండా.. కోపంతో వెయిటర్‌ని ప్రయాణికుడు చెంపదెబ్బ కొట్టాడు. నిజానికి వెయిటర్ చేసిన తప్పు ఏంటంటే.. అతను వెజ్‌కి బదులుగా ప్యాసింజర్‌కి నాన్‌వెజ్ ఫుడ్ ఇచ్చాడు. దీంతో.. వెయిటర్‌పై ఆగ్రహించిన ప్రయాణికుడు రైలులోనే బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన హౌరా-రాంచీ మధ్య చోటుచేసుకుంది. ప్రయాణంలో.. వెయిటర్ ఆహారంతో ప్రయాణికుడి వద్దకు వచ్చాడు. అయితే.. ప్రయాణీకుడు కంపార్ట్‌మెంట్‌పై ఇచ్చిన సూచనలను చదవకుండా తినడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతను వెయిటర్‌ను పిలిచి రైలులో గొడవకు దిగాడు.
Rashid Khan: రషీద్ ఖాన్ @600 వికెట్లు..
రైలులో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేశాడు. ఈ వీడియో క్యాప్షన్‌లో.. “ఈ వ్యక్తి శాఖాహారుడు.. అతనికి నాన్ వెజ్ అందించబడింది. ఇది అతనికి కోపం తెప్పించింది. దీంతో.. వెయిటర్‌ను చెంపదెబ్బ కొట్టాడు” అని రాశాడు. ఈ వీడియోలో ప్రయాణికుడు చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా.. వెయిటర్‌ని క్షమాపణ చెప్పమని పదే పదే అడిగాడు.
Chennai Drug seized: చెన్నైలో రూ.70 కోట్ల డ్రగ్స్ సీజ్.. ముగ్గురు అరెస్ట్
అయితే.. వెయిటర్ ఈ పొరపాటుకు ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పాడు. రైలులో ఉన్న ఇతర ప్రయాణికులు కూడా వెయిటర్ను క్షమాపణ చెప్పాలని కోరారు. మరోవైపు.. ఓ ప్రయాణికుడు ప్యాకెట్‌లో ఆహారం శాఖాహారమా కాదా అని రాసి ఉందని అతనికి చెప్పాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో యూజర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వెయిటర్ నీకంటే పేదవాడు, నీతో పోరాడలేడని, కాబట్టి అతనిపై మీ కోపాన్ని వెళ్లగక్కుతారా అని కామెంట్స్ చేస్తున్నారు.
Vande Bharat by mistake served Non-Veg food to a old person. He didn't saw instructions and ate the food. Being vegetarian he realised it tastes like non-veg so he got furious & gave 2 tight slap to the waiter.
Vande Bharat – Howrah to Ranchi
Date – 26/ July/ 24
Live recording- pic.twitter.com/Mg0skE3KLo— Kunal Verma (@itsmekunal07) July 27, 2024