వయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడి ఇప్పటి వరకూ 88 మంది చనిపోయారు. అలాగే వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. మరికొంత మందిని అధికారులు తీవ్రంగా శ్రమించి రక్షించారు. ఇప్పటికీ.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే శిథిలాల కింద మృతదేహాలు కనిపిస్తుండటంతో.. మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతుంది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం కేరళ ప్రభుత్వానికి రూ.5 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా తెలిపారు.
JP Nadda: నిపా, కోవిడ్-19 వ్యాధులు మానవేతర మూలాల నుండి ఉద్భవించాయి..
ఆయన ‘ఎక్స్’లో “వయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడటం.. తత్ఫలితంగా ప్రాణనష్టం గురించి తెలుసుకోవడం చాలా బాధ కలిగించింది. ఇప్పటికీ చాలా మంది ప్రజలు ఆ ప్రాంతంలో చిక్కుకున్నారు. నేను ఖచ్చితంగా రెస్క్యూ ఆపరేషన్‌లు చేస్తున్నాను. పూర్తి స్వింగ్ వారందరినీ కాపాడుతుంది, ఈ సంక్షోభ సమయంలో సోదర రాష్ట్రమైన కేరళకు అవసరమైన లాజిస్టికల్ లేదా మానవశక్తి మద్దతును అందించడానికి తమిళనాడు ప్రభుత్వం సిద్ధంగా ఉంది”. అని తెలిపారు. తమిళనాడు కేడర్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను సహాయక చర్యలు చేపట్టేందుకు నియమించారు. సీఎం స్టాలిన్ మంగళవారం కేరళ సీఎం పినరయి విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడి సహాయ, సహాయక చర్యలకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
Stock Markets: లాభాలతో ముగిసిన సూచీలు..
ఇదిలా ఉంటే.. ఒక డిప్యూటీ డైరెక్టర్ నేతృత్వంలో 20 మంది అగ్నిమాపక సిబ్బందితో కూడిన రెస్క్యూ టీమ్, 20 మంది సభ్యుల రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందం.. 10 మంది సభ్యుల వైద్య బృందం వయనాడ్‌లో సహాయక చర్యలు చేపడుతుంది. మరోవైపు.. ప్రధాని మోడీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.. అలాగే కొండచరియలు విరిగిపడి గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు.