వినేశ్ ఫోగట్‌కు భారీ షాక్ తగిలింది. రజత పతకం కోసం చేసిన ఆమె అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తిరస్కరించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయాన్ని సమర్థించాలని CAS నిర్ణయించింది. కాగా.. రజత పతకం వస్తుందని ఆశించిన వినేశ్ తో పాటు.. భారతవనికి నిరాశ ఎదురైంది.
క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లోకెక్కాడు. సింగర్-మోడల్ జాస్మిన్ వాలియాతో పాటు అతని పేరు ట్రెండింగ్‌లో ఉంది. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. కొందరు నెటిజన్లు ఇద్దరూ ఒకే దగ్గరుండి విహారయాత్ర చేస్తున్న ఫొటోలను గుర్తించారు. దీంతో.. వీరిద్దరు వైరల్ అయ్యారు. ఈ క్రమంలో నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ కరోల్‌బాగ్‌లోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనపై వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో 8 ఫైరింజన్లు అక్కడికి చేరుకుని.. రెస్క్యూ పనులు ప్రారంభించారు. అయితే.. అదృష్టవశాత్తూ మంటలు చెలరేగిన వెంటనే ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు భవనం నుంచి వెళ్లిపోయారు. దీంతో ప్రాణపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. అందులో ఉన్న ఎల్‌పీజీ…
14 ఏళ్ల తర్వాత గ్వాలియర్‌లో బంగ్లాదేశ్-భారత్‌ల మధ్య అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో.. ఇప్పటికే నిరసనలు మొదలయ్యాయి. గ్వాలియర్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య అంతర్జాతీయ మ్యాచ్‌ను నిర్వహించేందుకు అనుమతించబోమని హిందూ మహాసభ ప్రకటించింది. గ్వాలియర్ వీధుల్లో నిరసనలు తెలుపుతూ స్టేడియంలోని పిచ్‌ను తవ్వుతామన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై ఊచకోతకు పాల్పడుతున్నారని హిందూ మహాసభ పేర్కొంది. హిందువుల ఇళ్లు, దేవాలయాలకు నిప్పు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూపీలోని రాయ్‌బరేలీలో ఇంట్లో నిద్రిస్తున్న ఏడేళ్ల బాలికపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు గ్రామస్తులకు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అనంతరం.. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టాంజానియాకు చెందిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తీసుకెళ్తున్నాడనే అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఆ వ్యక్తిని అధికారులు విచారించగా.. కొకైన్ క్యాప్సూల్స్ మింగినట్లు బయటపడింది. దీంతో.. అతనికి వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడు. క్యాప్సూల్స్‌లో నింపిన మందు విలువను లెక్కించగా.. కోట్ల రూపాయల్లో ఉంది.
వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తన తోటి బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్‌ను వెనక్కి నెట్టి రెండవ స్థానాన్ని సాధించాడు. రోహిత్ శర్మ ప్రస్తుతం రెండో స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ గా కొనసాగుతున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్లో ఇద్దరు యువకులు హైవేపై రీల్స్ చేస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో.. ప్రమాదవశాత్తు వెనుక నుండి వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. దీంతో.. యువకులు కొన్ని సెకన్ల పాటు గాల్లోనే ఉండి కిందపడ్డారు. సినిమాలో జరిగే సన్నివేశంలా అనిపించింది. కాగా.. ఈ ఘటనలో యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.
మైనర్ బాలికను లాడ్జికి తీసుకెళ్లి యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా.. వీడియో కూడా తీశాడు. ఈ ఘటన కర్ణాటకలోని ధార్వాడ్ నగరంలో జరిగింది. ఆగస్టు 8న ఓ లాడ్జికి తీసుకెళ్లి మైనర్‌పై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడు లైంగిక దాడి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చాలా మంది వాట్సాప్ గ్రూపుల్లో పెట్టగా, చాలా మంది ఇతర గ్రూపుల్లో షేర్ చేశారు.