బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కష్టాల ఊబిలో కూరుకుపోతుంది. తాజాగా.. ఆమెపై హత్య కేసు నమోదైందని సమాచారం అందుతోంది. ఈ కేసులో హసీనాతో పాటు పలువురి అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. బంగ్లాలో గత కొన్ని వారాలుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ నిరసనల్లో 500 మందికి పైగా మరణించారు. ఈ క్రమంలో.. హసీనా తన పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి వెళ్లింది.
Mumbai: పట్టపగలే ఓ వ్యక్తిపై మైనర్ బాలుడు కత్తితో దాడి.. అడ్డొచ్చిన వారిని..!
ఢాకా ట్రిబ్యూన్ కథనం ప్రకారం.. హసీనా సహా 6 మందిపై హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసు జూలై 19న ఢాకాలోని మహ్మద్‌పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసు కాల్పుల్లో కిరాణా దుకాణం యజమాని అబూ సయీద్ మృతి చెందాడు. ఇందులో పలువురు పోలీసు అధికారులు, ప్రభుత్వ పెద్దల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. హసీనాతో పాటు నిందితుల్లో అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ క్వాడర్, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ పోలీస్ ఐజీ చౌదరి అబ్దుల్లా అల్ మామున్, డీబీ మాజీ చీఫ్ హరునోర్ రషీద్, డీఎంపీ మాజీ కమిషనర్ హబీబుర్ రెహమాన్, డీఎంపీ మాజీ అధికారి బిప్లబ్ కుమార్ సర్కార్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా.. ఈ ఘటనకు సంబంధించి మహ్మద్‌పూర్‌కు చెందిన అమీర్ హమ్జా షతీల్ ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై మంగళవారం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.
Bangalore Bus Accident: బెంగళూరు ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. వాహనాలపైకి దూసుకెళ్లిన ఓల్వో బస్సు!
వివాదాస్పద ఉద్యోగ రిజర్వేషన్ వ్యవస్థపై తన అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృత నిరసనల నేపథ్యంలో.. గత వారం రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయిన 76 ఏళ్ల హసీనాపై నమోదైన మొదటి కేసు ఇది. జూలై 19న రిజర్వేషన్ ఉద్యమానికి మద్దతుగా చేపట్టిన నిరసనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో సయీద్ చనిపోయాడు. ఆగస్టు 5న బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం పతనం తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనల్లో 230 మందికి పైగా మరణించారు. కోటా వ్యతిరేక నిరసనలు జూలై మధ్యలో ప్రారంభమైనప్పటి నుండి హింసలో మరణించిన వారి సంఖ్య 560కి చేరుకుంది. కాగా.. హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. 84 ఏళ్ల నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్‌ను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించారు. యూనస్ తన 16 మంది సభ్యుల సలహా మండలి పోర్ట్‌ఫోలియోలను గత వారం ప్రకటించారు.