ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చాలాసార్లు వేలం నిర్వహించిన ప్రముఖ వేలం నిర్వాహకుడు హ్యూ ఎడ్మిడెస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తరపున ఆడుతున్న విరాట్ కోహ్లీ 2025 ఐపీఎల్ వేలంలోకి వస్తే.. అతను ఈజీగా 30 కోట్ల రూపాయలకు పైగా పొందగలడని హ్యూ ఎడ్మిడెస్ చెప్పారు. కాగా.. విరాట్ కోహ్లి తన కెరీర్ ప్రారంభం నుండి ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు. ఆ జట్టు కూడా అతనిని ప్రతీసారి రిటైన్ చేసుకుంటుంది.
Read Also: Venu Swami Wife: భర్తకి మద్దతుగా వీడియో రిలీజ్ చేసిన వేణుస్వామి భార్య
కాగా.. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు వేలంలో పాల్గొనలేదు. ఐపీఎల్ 2008లో కూడా అతన్ని U19 డ్రాఫ్ట్ నుండి ఆర్సీబీ సొంతం చేసుకుంది. అప్పటి నుండి.. అతను ఆర్సీబీ తరుఫునే ఆడుతున్నాడు. ఫ్రాంచైజీ కూడా అతనిని వదిలిపెట్టడం లేదు. అయితే.. 17 సీజన్లలో ఆ జట్టు ఒక్క టైటిల్ కూడా సాధించలేకపోయింది. కానీ ఇప్పటికీ జట్టు విరాట్ కోహ్లీపై నమ్మకం ఉంచుకుంది. ఇప్పటివరకూ ఆర్సీబీ ఇతర ప్లేయర్లను వదిలేసినా.. విరాట్‌ను అస్సలు వదిలిపెట్టలేదు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కూడా ఆర్సీబీ విరాట్‌ను రిటైన్ చేస్తుంది.
Read Also: Stock market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
క్రిక్‌బ్లాగ్‌కి చెందిన అరవింద్ కృష్ణన్‌తో హ్యూ ఎడ్మిడెస్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ వేలంలోకి వస్తే అతను రూ. 30 కోట్లకు పైగా పొందగలడని చెప్పారు. ‘విరాట్ కోహ్లీని వేలంలో ఉంచడం అతిపెద్ద గౌరవంగా భావిస్తున్నానని.. ధరను బట్టి చూస్తే రూ. 30 కోట్లకు పైగా పలుకుతాడని భావిస్తున్నాను’. అని అన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. లీగ్ చరిత్రలో 8000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 38.67 స్ట్రైక్ రేట్‌తో 132 పరుగులతో 8004 పరుగులు చేశాడు. టోర్నీ చరిత్రలో విరాట్ 7 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు సాధించాడు.