ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి కడుపునొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు అతన్ని పరీక్షించి హెర్నియా కోసం శస్త్రచికిత్స చేశారు. ఆ సమయంలో డాక్టర్లు షాక్ కు గురయ్యారు. అతని శరీరం లోపల స్త్రీ పునరుత్పత్తి అవయవాలను కనుగొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
Read Also: Bangladesh: విద్యార్థుల ఆందోళనపై తాత్కాలిక ప్రభుత్వాధినేత ప్రశంసలు
రాజ్‌గీర్ మిస్త్రీ అనే వ్యక్తి కొన్ని రోజులుగా కడుపులో నొప్పి రావడంతో అల్ట్రాసౌండ్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతని దిగువ కడుపులోని మాంసం ఇతర అంతర్గత అవయవాలతో తాకుతున్నట్లు గుర్తించాడు. దాని కారణంగా అతనికి హెర్నియా పెరిగింది. ఈ క్రమంలో.. అతను ఉచిత హెర్నియా తనిఖీ శిబిరానికి వెళ్లాడు. ఆ శిబిరంలో BRD మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్ర దేవ్ టెస్టులు చేసి.. హెర్నియా ఉన్నట్లు చెప్పారు. మిస్త్రీని ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్ కోరాడు.
Read Also: PM Modi: ఒలింపిక్స్ విజేతలతో మోడీ భేటీ..ఎప్పుడంటే..?
ఈ క్రమంలో.. డాక్టర్ దేవ్ పర్యవేక్షణలో మిస్త్రీకి శస్త్రచికిత్స జరిగింది. ఆ సమయంలో పొత్తికడుపులో అభివృద్ధి చెందని గర్భాశయం.. దాని ప్రక్కనే అండాశయం ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. కాగా.. ఆపరేషన్ చేసి దానిని తొలగించారు. దీంతో.. రాజ్‌గీర్ మిస్త్రీ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. డాక్టర్ దేవ్ మాట్లాడుతూ.. గర్భాశయం అనేది పుట్టుకతో వచ్చిన వైకల్యం అని.. కానీ అతనిలో స్త్రీ లక్షణాలు లేవని డాక్టర్ చెప్పారు.