పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో 92.97 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం సాధించిన అర్షద్ నదీమ్.. ఇప్పుడు పాకిస్థాన్‌లో స్టార్‌గా మారాడు. పాకిస్తాన్‌లోని ప్రతి మీడియా అర్షద్‌ను ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటుంది. దేశానికి స్వర్ణం సాధించిన అర్షద్‌పై అవార్డుల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా.. ఓ టీవీకి నదీమ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తనకు బహుమతిగా ఇచ్చిన మామపై జోక్ వేశాడు. గేదెను బహుమతిగా ఇచ్చే బదులు.. భూమి ఇవ్చొచ్చు కదా అన్నీ ఫన్నీగా అన్నాడు.
చైనా చాలా కాలంగా జనాభా రేటు తగ్గుదలపై ఆందోళన చెందుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన చైనా ఈ సమస్యను అధిగమించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాల వల్ల సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాభా రేటును పెంచడానికి చైనా అనేక చర్యలు తీసుకుంటోంది.. జనాభాకు ఆకర్షణీయమైన వాగ్దానాలు చేస్తోంది. జనాభాను పెంచేందుకు వీలుగా వివాహ ప్రక్రియను సులభతరం చేసి.. విడాకుల అంశాన్ని సంక్లిష్టం చేయాలని కమ్యూనిస్ట్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ 2024కి ఆతిథ్యం ఇవ్వడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అనుమతి నిరాకరించింది. దీంతో.. ఐసీసీ ( ICC) కొత్త వేదిక కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో.. యుఏఈలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా ఈ టోర్నీని అక్కడ నిర్వహించడం కష్టంగా మారింది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ఈ గేమ్స్‌లో భారత్ ఒక రజతం, ఐదు కాంస్య పతకాలతో సహా మొత్తం ఆరు పతకాలు సాధించింది. దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ భారత అథ్లెట్లతో సమావేశమయ్యారు. అథ్లెట్లందరూ ప్రధాని నివాసానికి చేరుకున్నారు.. అక్కడ వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా.. కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత పురుషుల హాకీ జట్టుతో మాట్లాడి వారిని ప్రశంసించారు. భారత రిటైర్డ్ గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్ అడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానమిచ్చారు. ఈ…
హార్దిక్ పాండ్యా జాస్మిన్ వాలియాతో డేటింగ్ రూమర్స్ గురించి నిజం తెలుసుకోవాలని అతని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇంతలో.. సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఉన్న జాస్మిన్ పక్కనే హార్దిక్ పాండ్యా చేతిని చూడవచ్చు. ఇంతకుముందు వీరిద్దరి ఫోటోలు ఒకే లొకేషన్ చూసి ఊహాగానాలు అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఈ ఫోటోను చూసిన తర్వాత నెటిజన్లు సోషల్ మీడియాలో హార్దిక్ పై తీవ్రంగా టోల్స్ చేస్తున్నారు. తాజాగా.. సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోపై హార్దిక్ పాండ్యా, జాస్మిన్ వాలియాల…
40 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలితా జ్యువెల్లరి.. ఇప్పుడు తన 55వ షోరూంను హైదరాబాద్లోని సుచిత్రా సర్కిల్లో ప్రారంభిస్తోంది. తయారీ ధరకే బంగారం, వజ్రాభరణాలను అందించేందుకు సిద్ధంగా ఉంది. తద్వార ప్రజలు పెద్దమొత్తంలో తమ కష్టార్జితాన్ని ఆదా చేయొచ్చు. అంతేకాదు ప్రారంభోత్సవం సందర్భంగా మార్కెట్లోనే ఇతర షోరూంలలో లభించని సరికొత్త 'బంగారు నగల కొనుగోలు పథకం'ను కూడా అందిస్తోంది.
'మంకీపాక్స్' ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తుంది. దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మధ్య మరియు తూర్పు ఆఫ్రికా నుండి మొదలైన ఈ ఇన్ఫెక్షన్ ఇప్పుడు భారతదేశానికి చేరువైంది. పాకిస్థాన్‌లో 3 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. సౌదీ అరేబియా నుండి వచ్చిన వ్యక్తిలో మొదటి కేసు కనుగొన్నారు. ముఖ్యంగా ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ విజృంభిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఆ దేశంలో…
టెస్ట్ క్రికెట్‌లో సచిన్ రికార్డును బద్దలు కొట్టగల సత్తా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ కు ఉందని.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. పరుగుల కోసం ఆతృతగా ఉన్నాడని, తర్వాతి నాలుగేళ్ల పాటు పరుగులు సాధిస్తాడని పాంటింగ్ తెలిపాడు. కాగా.. రూట్ ఇటీవలే టెస్టు క్రికెట్‌లో 12000 పరుగుల మార్క్‌ను దాటిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
మన దేశపు ఉప్పు, చక్కెరలో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్లు వార్తలు జనాలను టెన్షన్ పెడుతున్నాయి. అయితే.. ఓ స్టడీ ఫలితాల్లో నిజమే అని తేలింది. ఉప్పు, పంచదార కాకుండా.. మన శరీరంలోకి అనేక విధాలుగా మైక్రోప్లాస్టిక్‌లు వెళ్తున్నాయి. దాంతో.. అనేక ప్రధాన వ్యాధులకు గురవుతారు. మనం రోజు తాగే 'టీ' తాగడం వల్ల శరీరంలోకి ప్లాస్టిక్ వెళ్తుంది.
రోజూ యాపిల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని పెద్దలు చెబుతుంటారు. యాపిల్స్ తినడం వల్ల మంచి అనే అందరూ చెబుతుంటారు. ఎందుకంటే.. వాటిల్లో ఉండే విటమిన్లు, ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్.. యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అయితే యాపిల్ తింటే కొందరికి మంచిది కాదు. వారు.. యాపిల్స్ ను తినకూడదు.