జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో మళ్లీ ఉగ్రదాడి జరిగింది. ఈ ఉగ్రదాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అధికారి ఒకరు మరణించారు. కాగా.. ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు సిఆర్‌పిఎఫ్ జవాన్లు పెట్రోలింగ్ చేస్తుండగా డుడు ప్రాంతంలో ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. దీంతో.. భద్రతా బలగాలు వారికి ధీటుగా కాల్పుల మోత మోగించారు.
ఇటీవల నాగ్‌పూర్ జిల్లా కోర్టులో న్యాయమూర్తి చేసిన పని చర్చనీయాంశమైంది. జడ్జి ఎస్‌బి పవార్ కోర్టులో ఒక కేసు చర్చిస్తుండగా.. అదే సమయంలో 65 ఏళ్ల సీనియర్ న్యాయవాది తలత్ ఇక్బాల్ ఖురేషీ తన కేసులో న్యాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలోనే న్యాయవాది ఖురేషీ ఉన్నట్టుండి కింద పడిపోయాడు. అది చూసిన జడ్జి పవార్.. ఒక్కసారిగా తన కుర్చీలోంచి లేచి వెంటనే అతని దగ్గరకు వచ్చారు. అంతేకాకుండా.. జడ్జి పవార్ వెంటనే న్యాయవాదికి సీపీఆర్ (CPR) చేశారు. అయినప్పటికీ ఖురేషీలో ఏ మాత్రం చలనం…
మెరిసే చర్మం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు విటమిన్ ‘సి’ ఆరోగ్యానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. విటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. శరీరానికి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి.. పెరుగుదల, అభివృద్ధి, శరీర కణజాలం మరమ్మత్తు.. ఇనుము శోషణకు విటమిన్ సి అవసరం. దీని వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగమైనప్పటికీ.. ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల కలిగే కొన్ని […]
ఐఆర్‌సీటీసీలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు చాలా మంది లోయర్ బెర్త్ బుక్ చేసుకోవడానికి ఇష్టపడతారు. లోయర్ బెర్త్‌లోనైతా కిటికి పక్కన కూర్చుని ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ.. అవసరమైనప్పుడు ఫ్రీగా బోగీలో నడవడానికి వీలుంటుంది. అదే మిడిల్ లేదా అప్పర్ బెర్త్ విషయానికి వస్తే అయితే.. పైనకు ఎక్కి పడుకోవాలి, లేదంటే ఫ్లోర్ పై నిలబడాలి అన్నట్టుగా ఉంటుంది. అందుకే లోయర్ బెర్త్‌కు డిమాండ్ ఎక్కువ.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పథకం కింద దేశంలోని పేద రైతులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది.
యూపీలోని అమ్రోహాలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. చికిత్స నిమిత్తం ఓ తాంత్రికుడి దగ్గరికి వెళ్లిన యువతిపై అత్యాచారం చేసి అసభ్యకరమైన వీడియో తీశాడు. అయితే.. దానిని వైరల్ చేస్తానని బెదిరిస్తూ ఏడాది కాలంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నడు. అంతే కాకుండా.. బాధితురాలి నుంచి లక్ష రూపాయల వరకు దోచుకున్నాడు.
ఇటీవలే కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించిన వయనాడ్‌లో పంది మాంసం తినే ఛాలెంజ్‌పై తీవ్ర రచ్చ నెలకొంది. సహాయక చర్యల కోసం డబ్బు సేకరించేందుకు ప్రారంభించిన ఈ ప్రచారంపై ముస్లిం సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్‌ఐ) పోర్క్ ఛాలెంజ్‌పై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. ఇది ఏ మత సమాజాన్ని కించపరిచేలా చేయలేదని పేర్కొంది.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారతీయ సంతతికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఈ ఘటన టెక్సాస్‌లోని లంపాసాస్ కౌంటీలో జరిగింది. రోడ్డు ప్రమాదంలో 45 ఏళ్ల అరవింద్ మణి, అతని భార్య 40 ఏళ్ల ప్రదీపా అరవింద్, 17 ఏళ్ల కుమార్తె ఆండ్రిల్ అరవింద్ మరణించినట్లు సమాచారం. అరవింద్ మణి కుటుంబం లియాండర్‌లో నివసిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక్కరే మిగిలారు. ప్రమాదం జరిగిన సమయంలో అరవింద్ మణి 14 ఏళ్ల కుమారుడు అడ్రియన్ కారులో లేడని…
భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కొత్త అవతారమెత్తాడు. రిషబ్ పంత్ కెరీర్‌లో ఇప్పటివరకు చూడనిది ఈ మ్యాచ్‌లో కనిపించింది. రిషబ్ పంత్ కొన్ని క్షణాలు వేరే అవతారంలో కనిపించాడు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20ని ప్రారంభించింది. ఈ టీ20 టోర్నమెంట్‌లో రిషబ్ పంత్ ఆడుతున్నాడు. రిషబ్ పంత్ ఓల్డ్ ఢిల్లీ 6కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భవనంలోని మూడో అంతస్తు నుంచి ఏసీ తలపై పడి 19 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మృతుడు స్కూటర్‌పై కూర్చుని స్నేహితుడితో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు యువకుడి తలపై పడింది. ఈ ఘటన శనివారం (ఆగస్టు 17) జరిగింది. పక్కనే నిల్చున్న మృతుడి స్నేహితుడికి కూడా ఏసీ తగలడంతో అతను కింద పడిపోయాడు.