కారులో ఎన్నో రకాలైన ముఖ్యమైన పరికరాలు ఉంటాయి.. అవి కారుకు చాలా ముఖ్యం. వాటితో పాటు.. కారుకు ముఖ్యమై దానిలో బ్రేకింగ్ సిస్టమ్ ఒకటి. బ్రేకింగ్ సిస్టమ్ సరిగ్గా లేకుంటే సురక్షితమైన ప్రయాణాన్ని చేయలేము. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న అన్ని కార్లలో బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ అందుబాటులో ఉంది.
ప్రసిద్ధ బ్రిటిష్ బైక్ తయారీదారు బీఎస్ఏ (BSA) బైక్స్.. తన ప్రొడక్ట్ను 2021లో ప్రపంచవ్యాప్తంగా రీ మోడలింగ్ చేసింది. ఇప్పుడు ఈ బ్రాండ్ భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత మార్కెట్లోకి తిరిగి వచ్చింది. బీఎస్ఏ బైక్స్ తన మొదటి ఆఫర్ గోల్డ్ స్టార్ 650ని విడుదల చేసింది. హైలాండ్ గ్రీన్, ఇన్‌సిగ్నియా రెడ్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ధర రూ. 3 లక్షలు
కోల్కతా నైట్రైడర్స్ స్టార్ ఆల్రౌండర్, భారత క్రికెటర్ ఇంగ్లండ్‌లో అదరగొట్టాడు. తన బౌలింగ్‌తో జట్టును గెలిపించాడు. వెంకటేష్ అయ్యర్ లంకాషైర్ తరపున వన్డే గేమ్ ఆడుతున్నాడు. దాదాపు ఓడిపోయిన మ్యాచ్‌లో అయ్యర్ తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్రత్యర్థి జట్టు గెలవాలంటే 8 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి ఉంది. అయితే.. తన జట్టు సభ్యులంతా మ్యాచ్ ఓడిపోయిందని అనుకున్నారు. కానీ వెంకటేష్ అయ్యర్ మ్యాజిక్ చేశాడు.
ఉత్తరాఖండ్ లో జరిగిన అత్యాచారం, హత్య ఘటననను పోలీసులు చేధించారు. అదృశ్యమైన 33 ఏళ్ల నర్సుపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు ధర్మేందను బుధవారం అరెస్టు చేశారు. ఈ ఘటన ఉధమ్ సింగ్ నగర్ జిల్లా రుద్రాపూర్‌లో జూలై 30న జరిగింది.
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులపై ఆర్మీ చేపట్టిన 'ఆపరేషన్ సుజలిగల'లో హీరోగా నిలిచిన కెంట్ అనే జాగిలానికి మరణానంతరం రాష్ట్రపతి శౌర్య పురస్కారం ప్రకటించారు. గతేడాది సెప్టెంబర్ 11న ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆ జాగిలం ప్రాణాలు కోల్పోయింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష రంగంలో మరో పెద్ద ముందడుగు వేయనుంది. SSLV D3 రాకెట్ ప్రయోగానికి రేపు తెల్లవారుజామున 2 గంటల 47 నిమిషాలకు కౌంట్ డౌన్ షురూ కానుంది. ఆరున్నర గంటల పాటు కౌంటర్ ప్రక్రియ కొనసాగనుంది.
ఉత్తర్ ప్రదేశ్లోని బస్తీ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆస్పత్రి యాజమాన్యం మనుషులు ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళకు వైద్యుడి చేయాల్సిన ఆపరేషన్ను వార్డు బాయ్ చేశాడు. అంతే కాకుండా.. ఆ వార్డు బాయ్ చేసిన ఆపరేషన్‌ను వీడియో తీశాడు. అనంతరం.. తన ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేశాడు.
గుజరాత్‌లో మరో రైలు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం సూరత్ సమీపంలో అహ్మదాబాద్-ముంబై డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు కోచ్‌లు ట్రైన్ రన్నింగ్లో ఉండగానే ఊడిపోయాయి. కాగా.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజు మహిళా ఉద్యోగులకు ఒడిశా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలోని మహిళా ఉద్యోగులకు నెలలో ఒక రోజు పీరియడ్స్ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా ఈ ప్రకటన చేశారు.
తమిళనాడులో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ధర్మపురి, మొరప్పూర్ సమీపంలోని ఒక గ్రామంలో మంగళవారం రాత్రి ఓ ప్రేమజంట పారిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా కలకలం రేగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన యువతి కుటుంబ సభ్యులు యువకుడి తల్లిని తీసుకొచ్చారు. పారిపోయిన అమ్మాయి అగ్రవర్ణానికి చెందినది కాగా.. అబ్బాయి దళితుడని (ఎస్సీ) చెప్పారు.