‘మంకీపాక్స్’ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తుంది. దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మధ్య మరియు తూర్పు ఆఫ్రికా నుండి మొదలైన ఈ ఇన్ఫెక్షన్ ఇప్పుడు భారతదేశానికి చేరువైంది. పాకిస్థాన్‌లో 3 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. సౌదీ అరేబియా నుండి వచ్చిన వ్యక్తిలో మొదటి కేసు కనుగొన్నారు. ముఖ్యంగా ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ విజృంభిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఆ దేశంలో ఏడాది కాలంలో 548 మంది మరణించారు.
Thangalaan: మొదటి రోజే విక్రమ్ తంగలాన్ ఎన్ని కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?
మంకీపాక్స్ వైరస్ అంటే ఏమిటి..?
ఈ వైరస్ జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. మనుషుల్లోకి చేరిన తర్వాత వేగంగా వ్యాపి చెందుతుంది. ఈ వైరస్‌ను తొలిసారిగా 1958లో గుర్తించారు. దీని కేసులు చాలావరకు మధ్య మరియు పశ్చిమ ఆసియాలో కనుగొన్నారు. ఎందుకంటే.. అక్కడ మనుషులు జంతువులకు చాలా దగ్గరగా జీవిస్తారు.
మంకీపాక్స్ లక్షణాలు ఏమిటి?
ఈ వైరస్ సోకినప్పుడు మొదట్లో జ్వరం వస్తుంది. ఆ తర్వాత.. శరీరం అంతటా దద్దుర్లు వస్తాయి. ఈ దద్దుర్లు ముఖం, జననేంద్రియాలపై పుట్టుకువస్తాయి. అవి చీముతో నిండిన తెలుపు, పసుపు రూపంలో ఉంటాయి. ఇవి.. దురద, నొప్పిని కలిగిస్తాయి. అంతే కాకుండా.. జ్వరం, తలనొప్పి.. కండరాల నొప్పి ఉంటుంది. అయితే, ఈ వైరస్ చాలా అరుదుగా మరణానికి కారణమవుతుంది. ఇది దానంతటదే పోతుంది.
సంక్రమణ ఎలా ముగుస్తుంది..?
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. ఈ వైరస్ సోకిన తర్వాత 21 రోజుల వరకు లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ 14 నుండి 21 రోజుల వరకు ఉంటుంది. ఆ తరువాత.. అదే స్వయంగా నయం అవుతుంది. ఈ వ్యాధికి టీకా కూడా అందుబాటులో ఉంది.
వైరస్ ఎలా వ్యాపిస్తుంది..?
మంకీ పాక్స్ సోకిన వ్యక్తితో పరిచయం ద్వారా వ్యాపిస్తుంది. లైంగిక సంబంధాలు, చర్మ సంపర్కం కారణంగా సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ కళ్ళు, శ్వాస, ముక్కు, నోటి ద్వారా ప్రవేశిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులు తాకిన పరుపులు, వస్త్రాలు మొదలైన వాటి ద్వారా వ్యాపిస్తుంది. ఇది కాకుండా.. ఈ వైరస్ ఎలుక, ఉడుత, కోతులతో కూడా సంక్రమిస్తుంది.