China: పెళ్లి చేసుకోవడం ఈజీ.. విడాకులంటే కష్టం
- జనాభా రేటు తగ్గుదలపై ఆందోళన చెందుతున్న చైనా
- ఈ సమస్యను అధిగమించేందుకు రకరకాల ప్రయత్నాలు
- ఈ ప్రయత్నాల వల్ల సామాన్యులకు ఇబ్బందులు
- వివాహ ప్రక్రియను సులభతరం చేసిన చైనా ప్రభుత్వం
- విడాకుల అంశాన్ని సంక్లిష్టం చేయాలని కమ్యూనిస్ట్ ప్రభుత్వం నిర్ణయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా చాలా కాలంగా జనాభా రేటు తగ్గుదలపై ఆందోళన చెందుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన చైనా ఈ సమస్యను అధిగమించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాల వల్ల సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాభా రేటును పెంచడానికి చైనా అనేక చర్యలు తీసుకుంటోంది.. జనాభాకు ఆకర్షణీయమైన వాగ్దానాలు చేస్తోంది. జనాభాను పెంచేందుకు వీలుగా వివాహ ప్రక్రియను సులభతరం చేసి.. విడాకుల అంశాన్ని సంక్లిష్టం చేయాలని కమ్యూనిస్ట్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్యలు అక్కడి జనాల్లో ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
Bhogapuram: భోగాపురం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఏపీ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి తనిఖీ
Also Read
- Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే...!
జననాల రేటు గణనీయంగా తగ్గకుండా నిరోధించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. వివాహానికి దరఖాస్తు చేసుకునే జంటల నుండి చైనీస్ అధికారులు ఇకపై హుకౌ లేదా గృహ నమోదు అవసరం లేదు. ఈ కొత్త ప్రతిపాదిత చట్టంలో విడాకులను తగ్గించడానికి 30-రోజుల కూలింగ్ పీరియడ్ అందిస్తున్నారు, ఈ సమయంలో భార్యా భర్తలు ఇద్దరిలో ఎవరైనా ఒకరు విడాకులు తీసుకోవడానికి ఇష్టపడకపోతే, వారు దరఖాస్తును ఉపసంహరించుకోవచ్చు. ఆ తర్వాత విడాకుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేస్తారు. ఈ నిబంధన ఇప్పటికే 2021లో అమలులోకి వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో విడాకులు తీసుకోవడం మరింత కష్టతరంగా మారింది.
BCCI: భారత్లో ఉమెన్స్ వరల్డ్ కప్ నిర్వహణకు అనుమతి నిరాకరణ.. కారణం ఇదే..!
మరో ప్రతిపాదనలో వివాహాలను రిజిస్ట్రర్ చేయడానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాంతీయ పరిమితులను తొలగించింది, ఇకపై వివాహాలకు హౌస్‌హోల్డ్ రిజిస్ట్రర్ అవసరం లేదని పేర్కొంది. ఈ క్రమంలో అక్కడి జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజల ఆగ్రహావేశాలు కనిపిస్తున్నాయి. చైనా ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ.. ఈ చట్టాల వలన వివాహం, కుటుంబం ప్రాముఖ్యతను ప్రోత్సహించినట్లవుతుందన్నారు. అలాగే విడాకులను తగ్గించడం, సామాజిక స్థిరత్వాన్ని సమర్థించడం, వివాహాల పట్ల చట్టబద్ధమైన హక్కులను మెరుగ్గా రక్షించడం సాధ్యమవుతుందని తెలిపారు. కాగా.. చైనాలో యువత పెళ్లి విషయంలో పెద్దగా ఉత్సాహం చూపడం లేదని వార్తు వస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో కేవలం 34.3 లక్షల జంటలు మాత్రమే పెళ్లి చేసుకున్నాయి. ఇది 2013 నుండి చూసినట్లయితే చాలా అత్యల్పంగా ఉంది.
తాజావార్తలు
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..