పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో 92.97 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం సాధించిన అర్షద్ నదీమ్.. ఇప్పుడు పాకిస్థాన్‌లో స్టార్‌గా మారాడు. పాకిస్తాన్‌లోని ప్రతి మీడియా అర్షద్‌ను ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటుంది. దేశానికి స్వర్ణం సాధించిన అర్షద్‌పై అవార్డుల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా.. ఓ టీవీకి నదీమ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తనకు బహుమతిగా ఇచ్చిన మామపై జోక్ వేశాడు. గేదెను బహుమతిగా ఇచ్చే బదులు.. భూమి ఇవ్చొచ్చు కదా అని ఫన్నీగా అన్నాడు.
Read Also: Kaala Rathri: ఆహాలో కాళరాత్రి.. ఎప్పటి నుంచి అంటే?
తాను పారిస్లో గోల్డ్ మెడల్ సాధించనందుకు తన మామ మొహమ్మద్ నవాజ్ ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నాడని అర్షద్ నదీమ్ చెప్పాడు. అయితే.. ఆయన గేదెను గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాడని.. ఒకవేళ ఐదెకరాలు భూమి అయినా ఇచ్చి ఉండొచ్చు అని తెలిపాడు. కానీ.. తాను ఓకే అనడంతో గేదెను గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్పాడు. అది తనకు నచ్చిందని నవ్వుతూ చెప్పాడు. దీంతో.. యాంకర్ తో పాటు నదీమ్ భార్య తెగ నవ్వేశారు. కాగా.. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అర్షద్ నదీమ్ మామ ముహమ్మద్ నవాజ్ గ్రామంలో నివసిస్తున్నాడు. అతనికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా.. అర్షద్‌కు గేదెను బహుమతిగా ఇవ్వడంపై మామ నవాజ్ మాట్లాడుతూ, ఇది తమ సంప్రదాయమని, అతని హృదయం గ్రామంతో ముడిపడి ఉందని చెప్పాడు. అంతర్జాతీయంగా విజయం సాధించినప్పటికీ.. నదీమ్ ఇప్పటికీ తన తల్లిదండ్రులు, సోదరులతో కలిసి పంజాబ్‌లోని ఖనేవాల్‌లో నివసిస్తున్నాడు. నవాజ్ కుమార్తె అయేషాకు నదీమ్‌తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
Arshad Nadeem reaction on receiving buffalo as a gift from father-in-law.😂 pic.twitter.com/wJGBHeXtVu
— Sheri. (@CallMeSheri1_) August 15, 2024