Bhumana Karunakar Reddy: టీటీడీకి తీరని ద్రోహం చంద్రబాబు చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. మూడు వెల కోట్ల భూమిని ఒబెరాయ్ హోటల్‌కు ఇచ్చి వేంకటేశ్వర స్వామికే నామాలు పెట్టారని చెప్పారు. పరకామణి దొంగతనం కంటే వందరెట్లు పెద్ద దొంగతనం ఇదన్నారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. వంద రూముల హోటల్ కోసం మూడు వేలకోట్ల విలువైన స్వామి వారి భూములు ఇస్తారా..? అని ప్రశ్నించారు. అలిపిరి రోడ్డులో టూరిజం భూమి తీసుకుని దానిని బదులుగా టీటీడీ భూమి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఓబరాయ్ హోటల్ కోసం అత్యంత విలువైన భూమిని బదిలీ చేశారు. హోటల్ కు ఆ స్థలం ఇవ్వడమే కాకుండా లీజు కూడా మాఫీ చేశారు. మూడువేల కోట్లు విలువైన భూమిని చంద్రబాబు దోచిపెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు…
READ MORE: Avatar : రివ్యూస్‌తోనే షాక్ ఇస్తున్న ‘అవతార్ 3’.. విజువల్స్ అదిరాయి.. కానీ అదే మైనస్?
రిజిస్ట్రేషన్ చేసినా భూమి ఈసీలో ఇది కనపడటం లేదు… ఎందుకు దాచారు.. ఎవరి కోసం దాచిపెట్టారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి నిలదీశారు. “జీవో ఇవ్వకుండానే.. రిజిస్ట్రేషన్ కాకుండా అక్కడ ఉండే భూమిలోని ఎర్రచందనం చెట్లు మాయం చేశారు. అటవీశాఖ అధికారుల అనుమతి లేకుండా కలెక్టర్ అదేశాలతో ఇవన్నీ జరిగాయి. టీటీడీ భూమి ఎలా ఒబెరాయ్ హోటల్‌కు ఇస్తారు. స్వాములు, పీఠాధిపతులు అందరూ దీన్ని వ్యతిరేకించాలి. దీని వెనుక కోట్లా రూపాయల అవినీతి దాగి ఉంది. పవన్ కల్యాణ్ ఎందుకు దీన్ని అడ్డుకోలేదు.. పవన్, చంద్రబాబు కలసి ప్రైవేటు సంస్థకు ఇచ్చేశారు.” అని వెల్లడించారు.
READ MORE: Gold Silver Rates: చుక్కలు చూపిస్తున్న వెండి ధరలు.. ఇవాళ ఒక్కరోజే రూ.11 వేలు పెరిగిన సిల్వర్