PM Modi Praised: హాకీ కెప్టెన్ పై ప్రధాని మోడీ ప్రశంసలు..
- ప్రధాని మోడీ భారత అథ్లెట్లతో సమావేశం
- ప్రధాని నివాసంలో వారిని ఉద్దేశించి మోడీ ప్రసంగం
- భారత పురుషుల హాకీ జట్టుతో మాట్లాడి వారిని ప్రశంసించిన ప్రధాని
- హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌ను ప్రశంసించిన మోడీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ఈ గేమ్స్‌లో భారత్ ఒక రజతం, ఐదు కాంస్య పతకాలతో సహా మొత్తం ఆరు పతకాలు సాధించింది. దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ భారత అథ్లెట్లతో సమావేశమయ్యారు. అథ్లెట్లందరూ ప్రధాని నివాసానికి చేరుకున్నారు.. అక్కడ వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా.. కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత పురుషుల హాకీ జట్టుతో మాట్లాడి వారిని ప్రశంసించారు. భారత రిటైర్డ్ గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్ అడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా.. హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌ను ప్రధాని ప్రశంసించారు. ప్రధాని మోడీ శ్రీజేష్‌ను అడిగారు.. మీరు పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నారా అడగగా.. దీనిపై శ్రీజేష్ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ఆలోచిస్తున్నాను. తన సోదరుడు, సహచరులు ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించమని అడిగారన్నారు. తాను 2002లో తొలిసారిగా క్యాంప్‌కు వెళ్లి 2004లో జూనియర్ జట్టుతో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడానని శ్రీజేష్ తెలిపారు. అప్పటి నుంచి 20 ఏళ్లుగా దేశం తరఫున ఆడుతున్నాను.. రిటైరయ్యేందుకు ఇదే మంచి వేదిక అని శ్రీజేష్ పేర్కొన్నారు.
Read Also: Harish Rao : కలకలం రేపుతున్న హరీష్ రావు ఫ్లెక్సీలు
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఆ తర్వాత ప్రధాని మాట్లాడుతూ.. ‘ఈ బృందం మిమ్మల్ని ఖచ్చితంగా కోల్పోతుంది, కానీ ఈ బృందం మీకు అద్భుతమైన వీడ్కోలు ఇచ్చింది. ఇది మొత్తం టీమ్‌కి అభినందనలు.’ ఆ తర్వాత శ్రీజేష్ మాట్లాడుతూ.. ‘సెమీఫైనల్స్‌లో ఓడిపోయినప్పుడు మాకు కొంచెం కష్టమైంది. ఎందుకంటే పారిస్ ఒలింపిక్స్లో బంగారు పతకం సాధిస్తామని వెళ్లాం. సెమీఫైనల్‌లో ఓడిపోయినప్పుడు అందరికీ కాస్త బాధ అనిపించినా, చివరి మ్యాచ్ ఆడుతున్న శ్రీజేష్ భాయ్‌కి ఈ మ్యాచ్ గెలవాలని అందరూ అన్నారు. నాకెంతో గర్వకారణం.. నేను 17 సంవత్సరాలుగా భారతదేశం కోసం ఆటలో పాల్గొన్నాను, నా స్నేహితులు నాకు మద్దతు ఇచ్చారు. నా జట్టు ఆ వేదికపై నిలబడటం నాకు గర్వకారణం.’ అని శ్రీజేష్ తెలిపారు.
Read Also: Stock market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు స్వర్ణ పతకం సాధిస్తుందని భావించినా.. స్వర్ణం రాకపోయినా కాంస్య పతకాన్ని సాధించింది. కాంస్య పతక పోరులో భారత్ 2-1తో స్పెయిన్‌ను ఓడించింది. అంతకుముందు సెమీఫైనల్లో జర్మనీ చేతిలో భారత్ 3-2 తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 1980లో మాస్కో ఒలింపిక్స్ తర్వాత హకీలో భారత్ స్వర్ణం సాధించలేదు. ఒలింపిక్స్‌లో భారత్ అత్యధిక విజయాలు సాధించిన క్రీడ హాకీ. హాకీలో భారత్ ఇప్పటి వరకు మొత్తం 13 పతకాలు సాధించగా అందులో ఎనిమిది స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి.
#WATCH | PM Narendra Modi interacted with PR Sreejesh, who played the final match of his career at the Bronze-winning Hockey match at the Paris Olympics, during his interaction with the Indian Olympic contingent at his residence. pic.twitter.com/of12RIQLuj
— ANI (@ANI) August 16, 2024
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!