హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేశారు. మహిళా దినోత్సవ సంబరాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర సంస్థగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. మహిళందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా టంగుటూర్‌లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ ఘాతంతో శంభారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. సినిమా షూటింగ్ కోసం టంగుటూరులో లొకేషన్ చూపిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతం కావడంతో శంబారెడ్డి స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయాడు.
తెలంగాణ భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో రాజకీయంగా మహిళలు నష్టపోతున్నారని అన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టిన కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదని ఆరోపించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిల పక్షం సమావేశం అయింది. ప్రజా భవన్‌లో ఈ సమావేశం జరుగుతుంది. కాగా.. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఉన్నారు.
అమ్మవారి శక్తి స్వరూపాలు... సృష్టికి మూల కారకులు... కుటుంబాన్ని, సమాజాన్ని కంటికి పాపలా కాపాడుతున్న స్త్రీ మూర్తులందరికీ కేంద్రమంత్రి బండి సంజయ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సృష్టిలో ఏమీ ఆశించకుండా పిల్లల ఎదుగుదలకు జీవితాన్నే త్యాగం చేసేది తల్లి మాత్రమే.. అక్కా చెల్లెళ్ల రూపంలో, భార్యగా తోడునీడగా నిలిచేది స్త్రీ మూర్తులే.. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదని బండి సంజయ్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. ఇందిరా మహిళా శక్తి మిషన్‌ను ఆవిష్కరించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. లక్ష మంది మహిళలతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది ప్రభుత్వం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో పెద్దపులి సంచారం మళ్లీ కలవర పెడుతుంది. పల్గుల గ్రామ శివారు అడవిలో పులి పాదముద్రలు, సేదతీరినా ఆనవాళ్లను స్థానికులు గుర్తించారు. కాగా.. పులి సంచారంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్‌ను ఈడీ సీజ్ చేసింది. 4 గంటల పాటు ఫ్లైట్‌ను చుట్టుముట్టి అందులో ఉన్న వాళ్లను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ స్కాం కేసులో నిందితులు ఇదే ఫ్లైట్‌లో దుబాయ్ కి పారిపోయారు.
హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసు ఆధ్వర్యంలో రన్ ఫర్ యాక్షన్ 2k & 5k రన్-2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు.
ఎస్ఎల్‌బీసీ (SLBC)టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ఘటన 15వ రోజుకు చేరింది. జీపీఆర్ (GPR), క్యాడవర్ డాగ్స్లతో మార్క్ చేసి మృతదేహాల కోసం తవ్వకాలు చేపడుతున్నారు. డీ వాటరింగ్, TBM మిషిన్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి.