మధ్యప్రదేశ్‌లోని విదిష జిల్లాలో దారుణ హత్య జరిగింది. లోకల్ బీజేపీ నాయకుడు, మాజీ సర్పంచ్ రామ్ విలాస్ ఠాకూర్ భార్య రాణి ఠాకూర్‌ను గుర్తు తెలియని దుండగుడు గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు.
హోలీకి ముందు ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కొత్త గోధుమ సేకరణ విధానాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆమోదించారు. దీంతో పాటు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గోధుమ మద్దతు ధరను గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.150 పెంచారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గోధుమ మద్దతు ధర (MSP)ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
దేశ వ్యాప్తంగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో గెలిచినందుకు విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో.. మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలోని మోహోలో భారీ గందరగోళం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి విజయోత్సవాల సందర్భంగా జరిగిన ర్యాలీలో కొందరు దుండగులు రాళ్ల దాడి చేసి బైకులు, కార్లను తగలబెట్టారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని టీమిండియా కైవసం చేసుకుంది. టీమిండియా తాజా గెలుపుతో మరో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. విజయనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. శ్రేయాస్ అయ్యర్‌ను సైలెంట్ హీరో అని వ్యాఖ్యానించాడు. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో టీమిండియాకు సైలెంట్ హీరోగా నిలిచిన ఆటగాడిగా రోహిత్ శర్మ శ్రేయాస్ అయ్యర్‌ను సెలక్ట్ చేశాడు. అతని గురించి ఎక్కువ మాట్లాడ లేకపోయినా.. అతను తన పనిని పూర్తి అంకితభావంతో చేశాడని రోహిత్ శర్మ తెలిపాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత్–న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో.. న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా మొదట బౌలింగ్ చేయనుంది. కాసేపట్లో భారత్–న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో రోహిత్ శర్మ..? ఉన్నట్లు సమాచారం. తన భవిష్యత్‌పై సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌తో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఖైరతాబాద్ గణేష్ టెంపుల్ లో పూజలు నిర్వహించారు. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయం సాధించాలని పూజలు చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛాంపియన్ ట్రోఫీ గెలవాలని పూజలు, ప్రత్యేక హోమం చేశారు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు.
ఎస్ఎల్‌బీసీ (SLBC)టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ఘటన 16వ రోజు కొనసాగుతుంది. జీపీఆర్ (GPR), క్యాడవర్ డాగ్స్లతో మార్క్ చేసి మృతదేహాల కోసం తవ్వకాలు చేపడుతున్నారు. డీ వాటరింగ్, టీబీఎం మిషిన్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టన్నెల్ ఆపరేషన్‌లో కీలక పురోగతి లభించింది. టీబీఎం మెషీన్ ముందు భాగంలో ఒక మృతదేహం ఆనవాళ్లు.. కుడి చేయి, ఎడమ కాలు భాగాలను రెస్క్యూ బృందాలు గుర్తించాయి.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్‌తో ఏఐసీసీ పెద్దలు ఫోన్లో మాట్లాడారు. ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు.