అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. ఇందిరా మహిళా శక్తి మిషన్‌ను ఆవిష్కరించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. లక్ష మంది మహిళలతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది ప్రభుత్వం. అందులో భాగంగా.. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మహిళా శక్తి మిషన్‌ను ఆవిష్కరించనున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగే ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు.
Bhupalpally: మళ్లీ కలవర పెడుతున్న పెద్దపులి సంచారం.. పాదముద్రలు గుర్తింపు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా పలు పథకాలను అమలు చేస్తోంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులా చేసేలా ప్లాన్ చేసింది. ఇటీవల ఇందిరా మహిళా శక్తి మిషన్ కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సర్ప్, మెస్మాలకు విలీనం చేసి మహిళలకు లక్షల కోట్ల రూపాయల రుణం అందించడమే ఈ పథకం ఉద్దేశం. ఇకపై మహిళా సంఘాలన్నీ ఒకే వ్యవస్థ కింద పనిచేసేలా మహిళా శక్తి మిషన్ ను రూపొందించారు. మహిళా సంఘాలు ఏడాది కాలంలో సాధించిన విజయాలతో పాటు మహిళా సాధికారిత కోసం ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025లో పొందుపరిచారు. పలు జిల్లాల నుంచి మహిళలు ఈ సభకు తరలివచ్చి తిరిగి వెళ్లేలా 600కు పైగా ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Women’s Day : మహిళ త్యాగం, ప్రేమ ఎనలేనివి..!
ఇవాళ్టి మండల మహిళా సమైఖ్య సంఘాల ఆధ్వర్యంలో నడిచే 150 ఆర్టీసీ అద్దె బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 31 జిల్లా మహిళా సమైఖ్య సంఘాల ఆధ్వర్యంలో.. 31 జిల్లాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం ఆయిల్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. మహిళా సంఘాల సభ్యులకు రుణ బీమా, ప్రమాద బీమా చెక్కులను అందజేయనున్నారు. మహిళా సంఘాలకు రుణ సదుపాయాలు కల్పిస్తూ చెక్కులను జిల్లా మహిళా సమైఖ్యల అధ్యక్షులకు అందజేయనున్నారు. జిల్లా మహిళా సమైఖ్యల సభ్యులకు యూనిఫాం, చీరలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు.