హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసు ఆధ్వర్యంలో రన్ ఫర్ యాక్షన్ 2k & 5k రన్-2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పాల్గొన్నారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలందరికీ అంతర్జాతీయ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. మహిళలంటే సమజంలో ఇంకా చిన్న చూపు చూస్తున్నారు.. మహిళలు అంటే సెకండ్ గ్రేడ్ వర్కర్స్ లా చూస్తున్నారని అన్నారు. పురుషులు.. మహిళలు అందరికీ సమానత్వం ఉండాలని ఆమె పేర్కొన్నారు. మహిళలు అంటే ప్రతి ఒక్కరిలో గౌరవం ఉండాలి.. ఆపదలో ఉన్న మహిళలు, అమ్మాయిలను ఆదుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో మహిల వ్యక్తిత్వం వికాసం కోరుకోవాలి.. సమాజంలో మహిళలను ఎదుగనిద్దం, కాపాడుదామని మంత్రి సీతక్క తెలిపారు. మరోవైపు.. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మహిళలకు చేయూత అందిస్తున్నారని, పోలీస్ శాఖ ఫ్రీ హాండ్ ఇచ్చారని అన్నారు. రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం నుంచి అమలయ్యే అన్ని హామీలను అందిస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
Read Also: SLBC: 15వ రోజుకు చేరిన టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్.. పరిహారం విషయంలో కీలక ప్రకటన..!
సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. మహిళల ఎదుగుదల గుర్తింపు కోసం అంతర్జాతీయ మహిళ దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలు కష్టాలు అధిగమించి ముందుకు వెళుతున్నారు.. మహిళల భద్రత తమ బాధ్యత అని అన్నారు. మంత్రి సీతక్క ఎన్నో ఒడిదొడుకులు ఎదురుకుని ఈరోజు మన ముందు మంత్రిగా నిలబడ్డారని చెప్పారు. మహిళలు, అమ్మాయిల కోసం సిటి పోలీస్ & షీ టీమ్స్ ఎన్నో భద్రత చర్యలు తీసుకున్నాయని తెలిపారు. 8 మంది మహిళా డీసీపీలు హైదరాబాద్ పోలీస్ శాఖలో ఉన్నారు.. మహిళలు ఆయా పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీస్‌గా ఉన్నారని చెప్పారు. మహిళల భద్రత, శాంతి భద్రతలు కాపాడడంలో తాము రాజీపడమని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.