హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ల్యాండ్ గ్రాబర్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురు సభ్యులు గల ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బండ్లగూడ పద్మశ్రీ హిల్స్‌లో 4 కోట్ల రూపాయల విలువ చేసే 600 గజాల స్థలం కబ్జాకు ముఠా స్కెచ్ వేసింది.
రేపు (శనివారం) ప్రజా భవన్లో అన్ని పార్టీల ఎంపీల సమావేశం జరగనుంది. కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణలో భారీగా ఐపీఎస్లు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులకు క్రమశిక్షణ సంస్కారం నేర్పాల్సిన ఫిజికల్ డైరెక్టర్ విద్యార్థులపై విరుచుకుపడ్డాడు. మేడ్చల్ జిల్లా కీసర ప్రభుత్వ పాఠశాలలో పీఈటీ ఆనంద్ అరాచకం సృష్టించాడు. ఒంట్లో బాగా లేదన్నా వినకుండా 8 మంది విద్యార్థినిలను పీఈటీ చితకబాదాడు.
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. మూడు గంటల పాటు సుదీర్ఘంగా భేటీ కొనసాగింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళను శక్తిగా కొలిచే సంప్రదాయం ఒక్క భారత్‌లోనే ఉందని అన్నారు. ఇంటిని నడిపే మాతృమూర్తి మహిళ అని పొగిడారు. పార్టీలో ఎలాంటి బాధ్యతలు ఇచ్చిన అద్భుతంగా మహిళా మోర్చా నేతలు పని చేస్తున్నారని తెలిపారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత్-న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈనెల 9న (ఆదివారం) దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మెదక్- నిజామాబాద్-కరీంనగర్- ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ముగిసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య ఘన విజయం సాధించారు.
అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో యాసంగి పంట సాగుకు సరిపడ సాగు నీరు అందించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో.. యాసంగి సీజన్ పంట సాగు, రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలపై సీఎస్ సమీక్ష నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. సీతారామ ప్రాజెక్ట్ ఎత్తిపోతల పనులను ఆయన పరిశీలించారు. ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2ను మంత్రి తుమ్మల పరిశీలించారు. అనంతరం.. పంప్ హౌస్ 2 నుంచి గోదావరి జలాలను దిగువకు విడుదల చేశారు.