ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కాసేపట్లో భారత్–న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా మ్యా్చ్ జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఎన్టీవీతో యువ క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్, కోచెస్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
మెదక్ జిల్లాలో భారీగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అంతుచిక్కని వ్యాధితో మొన్నటి వరకు బాయిలర్ కోళ్లు, నేడు వేల సంఖ్యలో నాటు కోళ్లు మృతి చెందాయి. నర్సాపూర్ (మం) లింగాపూర్ గ్రామంలో 6 వేల నాటు కోళ్లను ప్రసాద్ అనే రైతు పెంచుతున్నాడు. ఉదయం నుంచి కోళ్ల ఫారంలో అంతుచిక్కని వ్యాధితో 3500 నాటుకోళ్లు మృత్యువాత పడ్డాయి.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అస్వస్థతకు గురయ్యారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ధన్ఖడ్‌ను క్రిటికల్ కేర్ యూనిట్‌లో చేర్చారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని.. చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో రసవత్తర సమరానికి సమయం అసన్నమైంది. అన్ని లీగ్ మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత్.. ఈరోజు జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడబోతుంది. ట్రోఫీని దక్కించుకునేందుకు రోహిత్ సేనకు ఇదో మంచి అవకాశం అని చెప్పాలి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది. దుబాయ్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. దుబాయ్‌లో భారత్ మ్యాచ్ లు ఆడింది. ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా నాలుగు విజయాలు సాధించి ఫైనల్‌కు చేరుకుంది. దుబాయ్‌లోని పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. అందులో స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు.
డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కి షాక్ తగిలింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025( WPL)లో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. శనివారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో టోర్నీ నుంచి ఔట్ అయింది. కాగా ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న మూడు జట్లను ప్రకటించారు.
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భాగంగా.. ఈరోజు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2.30 గం.కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును సాధించే అవకాశం ఉంది.
కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 8.15 గం.కు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు.
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ఉన్న ఎస్సారెస్పీ కెనాల్‌లో కారు అదుపుతప్పి పడిపోయింది. ఆ కారులో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తున్నారు. కారు కాలువలో పడగా.. స్థానికులు గమనించి కారులో నుంచి మహిళను కాపాడారు స్థానికులు. బాలుడు మృతి చెందాడు.
బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్ని మతాలను దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. దేశంలో చాలా తక్కువ శాతం ఉన్న మతాల పరిస్థితి ఉందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం భయందోళనలో ఉందని ఆరోపించారు.