ఎస్ఎల్బీసీ (SLBC)టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ఘటన 15వ రోజుకు చేరింది. జీపీఆర్ (GPR), క్యాడవర్ డాగ్స్లతో మార్క్ చేసి మృతదేహాల కోసం తవ్వకాలు చేపడుతున్నారు. డీ వాటరింగ్, TBM మిషిన్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు.. నేడు ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రానున్నారు. ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సంఘటన స్థలంలో ఉండి సమీక్ష నిర్వహించారు. మరోసారి టన్నెల్ వద్దకు వెళ్లి టన్నెల్‌లో రెస్క్యూను పరిశీలించనున్నారు. మరోవైపు.. మృతుల కుటుంబాలకు పరిహారం విషయంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Read Also: Hyderabad: అంబర్‌పేట్‌లో 19 నెలల చిన్నారిపై కుక్కల దాడి.. తీవ్ర గాయాలు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పని సమయంలో సంభవించిన ఘోర ప్రమాదం ఇంకా అందరినీ కలిచివేస్తోంది. ఈ ప్రమాదంలో టన్నెల్ లోపల 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. నీటి ముంపు, టన్నెల్ కూలిన కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అప్పటి నుంచి ఈ ఘటనకు సంబంధించిన రక్షణ చర్యలు విరామం లేకుండా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), SDRF, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?