ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్‌ను ఈడీ సీజ్ చేసింది. 4 గంటల పాటు ఫ్లైట్‌ను చుట్టుముట్టి అందులో ఉన్న వాళ్లను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ స్కాం కేసులో నిందితులు ఇదే ఫ్లైట్‌లో దుబాయ్ కి పారిపోయారు. 15 రోజుల క్రితం దుబాయ్ కి పారిపోయి తిరిగి ఫ్లైట్‌ను హైదరాబాద్‌కు పంపారు నిందితులు.. అర్ధరాత్రి సమయంలో ఈ చార్టర్డ్ ఫ్లైట్ శంషాబాద్‌లో ల్యాండ్ అయింది. విమానం రాకను ముందుగానే పసిగట్టిన ఈడీ అధికారులు.. ఫ్లైట్‌ను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.
Read Also: PM Modi: మోడీ కాన్వాయ్ రిహార్సల్ చేస్తుండగా బాలుడు సైక్లింగ్.. చితకబాదిన పోలీస్
తక్కువ పెట్టుబడికి అధిక లాభాలిస్తామంటూ రూ.1700 కోట్లు వసూల్లు చేసింది ఫాల్కన్ కంపెనీ. పెట్టుబడిని అంతర్జాతీయ సంస్థల్లో పెట్టి లాభాలను పంచుతామంటూ ప్రచారం చేసింది. ఇది నమ్మిన జనాలు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులతోనే కీలక సూత్రధారి అమర్‌దీప్ కుమార్ చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేశాడు. కాగా.. సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయగానే అమర్‌దీప్‌తో పాటు 10 మంది పరారయ్యారు. విదేశాల్లో ఎంజాయ్ చేసుకునేందుకు చార్టర్డ్ ఫ్లైట్‌ను కొనుగోలు చేసుకున్నాడు. ఫాల్కన్ సీఈవో, సీవోవో కుటుంబాలతో కలిసి అమర్‌దీప్ ఎస్కేప్ అయ్యాడు. మరోవైపు అమర్‌దీప్‌తో పాటు 15 మందిపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Tamannaah : ప్రేమించే వ్యక్తిని జాగ్రత్తగా ఎంచుకోండి..