Chicken Biryani: బిర్యానీ తినండి, లక్ష పట్టుకెళ్లండి.. ఓ రెస్టారెంట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్
- బిర్యానీ తినండి.. లక్ష పట్టుకెళ్లండి
- కోయంబత్తూరులోని ఓ రెస్టారెంట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్
- ఛాలెంజ్ లో పాల్గొన్న వందలాది మంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోయంబత్తూర్‌లోని బోచే ఫుడ్ ఎక్స్‌ప్రెస్ రైలు రెస్టారెంట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ నిర్వహించింది. ఈ ఛాలెంజ్లో బుధవారం వందలాది మంది పాల్గొన్నారు. అయితే.. ఈ ఛాలెంజ్ ఎలా ఉందంటే.. 30 నిమిషాల్లో 6 ప్లేట్ల బిర్యానీ తినాలి. అలా తిన్న వారికి లక్ష రూపాయల బహుమతిని గెలుచుకోవచ్చని ఆ రెస్టారెంట్ ప్రకటించింది. అయితే.. ఇటీవలే కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్‌లో బోచే ఫుడ్ ఎక్స్‌ప్రెస్ రైలు రెస్టారెంట్ ప్రారంభించారు. రెస్టారెంట్ పాపులారిటీ కోసం ఇలాంటి ఆఫర్లును ప్రకటించింది.
Read Also: AP Pensions: పింఛన్‌దారులకు శుభవార్త.. ఈ నెల 31నే పింఛన్లు
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
కాగా.. ఈ ఛాలెంజ్ వార్త తెలియగానే రెస్టారెంట్ కు జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇందులో పలువురు పురుషులు, మహిళలు పాల్గొన్నారు. అయితే.. ఈ ఛాలెంజ్ లో పాల్గొనేందుకు చాలా మంది ఆసక్త చూపడంతో.. గురువారం ఉదయం వరకు పోటీ జరిగింది. ఈటింగ్ ఛాలెంజ్ పై రెస్టారెంట్ ఓనర్ మాట్లాడుతూ, “మేము బిర్యానీ పోటీని నిర్వహించాము. ఇందులో ఆరు ప్లేట్లు తిన్నవారికి లక్ష రూపాయలు గెలుచుకుంటారని.. మూడు ప్లేట్లు తిన్నవారికి 50,000 రూపాయలు ఇస్తాం” అని ప్రకటించామన్నారు. ప్రస్తుతం 400 మంది రిజిస్టర్ చేసుకున్నారని.. ఎక్కువ మంది వస్తున్నారని తెలిపారు.
Read Also: Railway Station Collapses: మిజోరంలో కొండచరియలు విరిగిపడి కుప్పకూలిన రైల్వే స్టేషన్
ఈ పోటీలకు మంచి స్పందన వస్తుండటంతో భవిష్యత్తులో మరిన్ని పోటీలు నిర్వహిస్తామని యాజమాన్యం తెలిపింది. ఈ పోటీ కోసం 1,000 ప్లేట్ల బిర్యానీని తయారు చేశామని, కిచెన్ లో వర్కర్లు 24 గంటలు పని చేస్తూనే ఉన్నారని తెలిపారు. కాగా.. ప్రతి నెలా ఒక కొత్త పోటీని నిర్వహించాలని తాము ప్లాన్ చేస్తున్నామన్నారు. తర్వాత.. మసాలా దోస పోటీ ఉండవచ్చని యాజమాన్యం పేర్కొంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?