Railway Station Collapses: మిజోరంలో కొండచరియలు విరిగిపడి కుప్పకూలిన రైల్వే స్టేషన్
- మిజోరంలోని కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు
- భారీ వర్షాలు దాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జనాలు
- కొండచరియలు విరిగిపడి కుప్పకూలిన రైల్వే స్టేషన్
- కవాన్‌పుయ్‌లో కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో.. త్రిపుర, రాజస్థాన్, గుజరాత్‌లలో జనజీవనం అతలాకుతలమైంది. అటు.. గత తొమ్మిది రోజులుగా మిజోరంలోని కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. భారీ వర్షాలు దాటికి కొండచరియలు విరిగిపడి కవాన్‌పుయ్‌లో కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్ కుప్ప కూలింది. ఈ ఘటనపై ఈశాన్య సరిహద్దు రైల్వే CPRO కపింజల్ కిషోర్ శర్మ మాట్లాడుతూ.. మిజోరంలో కొత్తగా నిర్మించిన క్వాన్‌పుయ్ రైల్వే స్టేషన్ కొండచరియలు విరిగిపడటంతో పాక్షికంగా దెబ్బతింది అని తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరరగలేదని చెప్పారు. కాగా.. ఆగస్టు 28న ఈ ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
Read Also: Maharashtra: ట్యూషన్ క్లాస్‌లో బాలికపై లైంగిక వేధింపులు.. కీచక గురువును చితకబాదిన స్థానికులు
Also Read
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
కొన్ని జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
భారీ వర్షాల దృష్ట్యా నాలుగు జిల్లాల్లో పాఠశాలలను మూసివేయాలని మిజోరం ప్రభుత్వం బుధవారం ఆదేశించింది. ఐజ్వాల్, లుంగ్లీ, హన్హతియాల్.. మమిత్ జిల్లాల పరిపాలనలు వేర్వేరుగా పబ్లిక్ నోటీసులు జారీ చేశాయి. జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ముందుజాగ్రత్త చర్యగా అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. ఐజ్వాల్ నగరం మరియు చుట్టుపక్కల గ్రామాలలోని అనేక ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడటం, మట్టి విరిగిపడటం.. రాతి పడిపోయినట్లు ఐజ్వాల్ జిల్లా యంత్రాంగం జారీ చేసిన నోటీసులో పేర్కొంది. జిల్లాలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గత వారం భారీ వర్షాల కారణంగా ఐజ్వాల్, కొలాసిబ్ జిల్లాల్లో వరుసగా ఐదు రోజులు సెలవులు ప్రకటించారు. దక్షిణ మిజోరంలోని సియాహా జిల్లాలో కొన్ని రోజులు పాఠశాలలు మూసివేశారు.
Kapinjal Kishore Sharma, CPRO of Northeast Frontier Railway tells ANI, "Under-construction Kawnpui Railway Station in Mizoram was partially damaged due to landslide. There is no report of any casualty in the incident. The incident occurred on Wednesday, 28th August."
— ANI (@ANI) August 29, 2024
Read Also: Haj Yatra 2025: వచ్చే ఏడాది నుంచి హజ్ యాత్రలో కొత్త నిబంధనలు.. అవెంటంటే..?
తాజావార్తలు
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!