సౌదీ అరేబియా ప్రభుత్వం కొత్త నిబంధనలు, మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు జారీ చేసిన మినహాయింపులను రద్దు చేసింది. వచ్చే ఏడాది హజ్ యాత్రలో చాలా మార్పులు కనిపించబోతున్నాయి. అందులో ప్రధానంగా వయస్సు మార్పు. ఇందులో రిజర్వ్ కేటగిరీ వయస్సు 70 నుండి 65 సంవత్సరాలకు తగ్గించారు. మరొకటి.. హజ్ యాత్రలో భార్యాభర్తలు కలిసి ఒకే గదిలో ఉండకూడదనే పరిమితి విధించింది.
రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు లక్నో సూపర్ జెయింట్స్ రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయ్యింది. కాగా.. లక్నో జట్టు ఓనర్ గోయెంకా ఆ పుకార్లను ఖండించారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులోని మార్హ్‌లో భద్రతా బలగాలు-నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు సహా నక్సల్స్ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అబుదాబి యువరాజు ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వచ్చే నెల (సెప్టెంబర్)లో భారత్‌లో పర్యటించనున్నారు. కాగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదుపరి నాయకత్వం కోసం నహ్యాన్ పోటీదారుగా ఉన్నారు. పర్యటనలో భాగంగా.. భారతదేశం-యుఏఈ మధ్య వాణిజ్యం, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చల కోసం భారత్ కు రానున్నట్లు తెలుస్తోంది. షేక్ ఖలీద్ సెప్టెంబర్ 8న భారత్‌కు వచ్చే అవకాశం ఉంది.
ఓ విద్యార్థినికి అశ్లీల చిత్రాలు చూపించి, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు స్కూల్ స్వీపర్. ఈ ఘటన మహారాష్ట్రలోని నందుర్‌బార్ జిల్లాలోని ఓ పాఠశాలలో జరిగింది. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం కారణంగా.. పాకిస్తాన్, ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ భూకంపం ఉదయం 11:26 గంటలకు సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.7 గా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్దారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి నెలలా కాకుండా.. సెప్టెంబర్ నెలలో ముందుగానే పెన్షన్ ఇవ్వనుంది. ప్రతి నెలా 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈనెల 31వ తేదీనే (శనివారం) పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడం.. ఆ రోజు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఘటనలు పెరుగుతున్నాయి.. ఇది ఆందోళన కలిగించే విషయం. ఇందుకు సంబంధించి ఒక కొత్త నివేదిక వెల్లడి చేసింది. నివేదిక ప్రకారం.. భారతదేశంలోని విద్యార్థుల ఆత్మహత్యల రేటు జనాభా పెరుగుదల రేటు కంటే ఎక్కువగా ఉందని తెలిపింది. ఇదే కాకుండా, ఈ రేటు మొత్తం ఆత్మహత్య రేటును కూడా మించిపోయిందని పేర్కొంది.
ఐసీసీ ప్రెసిడెంట్గా ఎన్నికైన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జై షాకు క్రికెట్ గాడ్, భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శుభాకాంక్షలు తెలిపారు. బోర్డు కార్యదర్శిగా పురుషుల, మహిళల క్రికెట్‌కు సమాన ప్రాధాన్యత ఇవ్వడంలో జైషా చేసిన కృషిని సచిన్ ప్రశంసించారు.
రాష్ట్రంలో పత్తి సాగు, ఉత్పత్తి పెరగడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా కలిగేలా నూతన వంగడాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత తెలిపారు. రాష్ట్రంలో రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేస్తేనే సెస్ తొలగిస్తామని పత్తి స్పిన్నింగ్, జిన్నింగ్ వ్యాపారులకు మంత్రులు స్పష్టం చేశారు. పత్తి రైతుల దగ్గర మొత్తం పంట కొనుగోలు చేసేలా సీసీఎల్కు, కేంద్రానికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు.