ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా.. దేశ వ్యాప్తంగా మొత్తం 12 గ్రీన్ సిటీస్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అందులో ఏపీకి రెండు.. తెలంగాణకు ఒక “పారిశ్రామిక స్మార్ట్ సిటీ” కేటాయించింది.
పార్టీలో చేరికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోకి ఎవరొచ్చినా.. రాజీనామా చేసే రావాలని తెలిపారు. నేతల వ్యక్తిత్వం ఆధారంగా పార్టీలో చేర్చుకునేది లేనిది.. నిర్ణయిస్తామని సీఎం పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పార్టీలో చేరికలపై స్పందించారు. అభివృద్ధిని చూసి ఎన్డీఏ కూటమిలోకి వచ్చే వారికి ఆహ్వానం పలుకుతామని అన్నారు.
ఈ రోజు కేంద్రం నుండి విడుదలైన రూ.12 వేల కోట్లు గతంలో వైఎస్ జగన్ చేసిన కృషి వల్లే వచ్చాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అసత్యాలను చెప్తున్నారన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు కమీషన్లకు కక్కుర్తి పడ్డారని.. అందుకే ప్రాజెక్ట్ ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు.
పోలవరంకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం మొదటి దశ నిర్మాణానికి అవసరమైన రూ. 12,500 కోట్ల ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో.. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ, పోలవరం విషయంలో కేంద్రం చొరవ చూపుతోందని అన్నారు. ఏపీ అభివృద్ధి విషయంలో కేంద్రం కట్టుబడి ఉందని తన చర్యల ద్వారానే చెబుతోందని తెలిపారు. కేంద్రం స్పందిస్తున్న తీరు చూస్తుంటే సంతోషం వేస్తోందని.. పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేలా కేంద్రం…
కేబినెట్లో మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోందని సీఎం తెలిపారు. మీడియా నిండా వాళ్లు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయన్నారు. దీని వల్ల అందరికి చెడ్డ పేరు వస్తోందని చెప్పారు.
ఈరోజు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా.. పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం మొదటి దశ నిర్మాణానికి అవసరమైన రూ. 12,500 కోట్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
దేశవ్యాప్తంగా 234 నగరాల్లో కొత్తగా ఎఫ్.ఎమ్ రేడియో సౌకర్యం కల్పించనుంది. అందులో భాగంగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా మరిన్ని ఎఫ్.ఎమ్ రేడియో కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో అమానుష ఘటన చోటు చేసుకుంది. శ్రీరామ్ నగర్ కాలనీలో నివసిస్తున్న మానసిక వికలాంగురాలైన మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా ఆ బాలికపై కామాంధులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. అంతేకాకుండా.. అత్యాచారం చేస్తూ వీడియోలు తీశారు. నిందితులు సంతోష్ నాయక్, అజయ్, సుభాష్ మైనర్లుగా గుర్తించారు. కాగా.. ఈ వీడియోలు వైరల్ కావడంతో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.
వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేశారు. ఆమె.. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ మేరకు రాజీనామా లేఖను జగన్‌కు పంపినట్లు తెలుస్తోంది. కాగా.. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సునీత తెలిపింది.
భర్తను హత్య చేసిన ఘటనలో పార్వతీపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యతో సహా హత్యకు సహకరించిన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ క్రమంలో.. ఈ కేసుకు సంబంధించి తీర్పు ఈరోజు వెలువడింది.