వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టనున్నారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్ర మంత్రివర్గం ఈరోజు భేటీ అయింది.
ఈరోజు మధ్యాహ్నం 12 గంటల లోపే స్టాక్ మార్కెట్ కుదేలయింది. ప్రముఖ ఐటీ కంపెనీల షేర్ల పతనం నుంచి స్టాక్ మార్కెట్ కోలుకోలేకపోయింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3.15 శాతం పడిపోయింది. టీసీఎస్ (TCS) నుండి Mphasis వరకు షేర్లు అదే బాటలో నడుస్తున్నాయి.
గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్‌లో చనిపోయిన కార్మికుడి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనుంది. ఈ క్రమంలో.. గల్ఫ్ కార్మికుల వెల్ఫేర్ కోసం అడ్వైజరి కమిటీ నియామకం కానుంది.
వినాయక నిమజ్జనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శోభాయాత్రలో ఆడిపాడుతున్నారు. ఇంతలో అనుకోని సంఘటన జరిగింది. గణేష్ శోభాయాత్ర వాహనంలో ఉంచిన బాణాసంచా ఒక్కసారిగా పేలింది. ఏం జరిగిందో అర్థమయ్యే లోపు డ్యాన్స్ చేస్తున్న వారు గాయాలతో పడి ఉన్నారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లు SUV సెగ్మెంట్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. 2024 సంవత్సరం ఫస్టాప్‌లో కార్ల విక్రయాలలో SUV అధికంగా విక్రయించింది. కాంపాక్ట్ SUVలను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందులో టాటా పంచ్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, ఎక్సెటర్ వంటి SUVలు ఉన్నాయి.
గణేశ్ లడ్డూ వేలం అంటేనే ముందుగా గుర్తొచ్చేది బాలాపూర్ లడ్డూ. ఆ లడ్డు దక్కించుకోవడం కోసం చాలా మంది పోటీ పడతారు. అదే స్థాయిలో ధర కూడా రికార్డ్ స్థాయిలో పలుకుతుంది. ఏడాది ఏడాదికి పెరుగుతూ వస్తోంది. ఈ లడ్డూను దక్కించుకుంటే మంచి జరుగుతుందని, సుఖ సంతోషాలతో జీవిస్తామని భక్తుల నమ్మకం.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ఉత్తమ ఆటగాళ్లకు అవార్డులను ప్రకటించింది. ఈసారి శ్రీలంక ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించారు. పురుషుల జట్టులో స్టార్ ఆల్ రౌండర్ దునిత్ వెలలాగే, మహిళల జట్టులో హర్షిత సమరవిక్రమ ఆగస్టు నెలలో ప్లేయర్‌లుగా ఎంపికయ్యారు.
నాలుక రంగులో మార్పులు కూడా ఇన్ఫెక్షన్ లేదా అనేక రకాల తీవ్రమైన వ్యాధుల వంటి అంతర్లీన ఆరోగ్య సమస్యకు సంకేతమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నాలుక సాధారణంగా లేత ఎరుపు-గులాబీ రంగులో ఉంటుంది. అలా కాకుండా.. అసాధారణమైన మార్పు కనిపిస్తే జాగ్రత్తగా ఉండటం మంచిది. మన నాలుక శరీరంలో వచ్చే అనేక రకాల వ్యాధులను సూచిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
దర్శనానికి వచ్చిన భక్తులు.. దేవుడికి కానుకలు సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలో.. భక్తులు ఈసారి ఖైరతాబాద్ గణేషుడి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. రూ. 70 లక్షలు కానుకల ద్వారా హుండీ ఆదాయం వచ్చినట్లు గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది.
సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21న హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'సీతారాం ఏచూరి సంస్మరణ సభ' ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నామని తమ్మినేని వీరభద్రం చెప్పారు.