వరద సాయం కింద సీఎం రిలీఫ్ ఫండ్కు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం ఇచ్చింది. రూ. 25 కోట్లను చెక్కును సీఎం చంద్రబాబుకు అదానీ పోర్ట్స్, సెజ్ ఎండీ కరణ్ అదానీ అందించారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీని ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నామని అన్నారు.
చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. కాగా.. హోంగ్రౌండ్‌లో అశ్విన్ సెంచరీతో చెలరేగాడు. 108 బంతుల్లో శతకం సాధించాడు.
రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందించాలి.. ఇందుకు అనుగుణంగా పనుల్లో పురోగతి సాధించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. నిరంతరాయంగా ఇంటింటికీ తాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయం అని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో గ్రామీణ నీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకాలపై సీఎం సమీక్ష నిర్వహించారు.
హర్యానాలో బీజేపీకి షాక్ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మేనల్లుడు రమిత్ ఖట్టర్ గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ విషయాన్ని హర్యానా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ధృవీకరించింది. హర్యానాలోని రోహ్‌తక్‌లో కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే భరత్ భూషణ్ బన్నా సమక్షంలో రమిత్ ఖట్టర్ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు.
కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ కానున్నారు. నోవాటెల్ నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి బాలినేని బయలుదేరారు. పవన్‌తో భేటీ అనంతరం లాంఛనంగా జనసేన పార్టీలో చేరే విషయాన్ని బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రకటించనున్నారు.
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు రిమాండ్‌ను పొడిగించారు. మరో 14 రోజుల పాటు అంటే.. అక్టోబర్ 3 వరకు రిమాండ్ పొడిగిస్తూ మంగళగిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేశ్‌ను అరెస్ట్ చేశారు.
ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొత్తగా ఎన్నికకానున్న ముఖ్యమంత్రికి పని అప్పగించారు. అపరిశుభ్రతకు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. పశ్చిమ ఢిల్లీలో లక్షలాది మంది ప్రజలు నరకం కంటే హీనమైన జీవితాన్ని గడపాల్సి వస్తోందని ఎల్‌జీ పేర్కొన్నారు.
రేపు బంగ్లాదేశ్‌తో మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవవన్‌ని మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఎంపిక చేశాడు. తన జట్టులో ఎవరిని చేర్చుకున్నాడో దినేష్ కార్తీక్ వెల్లడించాడు.
మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో 21 ఏళ్ల చిలుకకు ఆపరేషన్ చేసి తన ప్రాణాలను కాపాడిన ప్రత్యేక కేసు వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం.. చిలుక మెడలో కణితి ఉందని, దాని వల్ల చిలుక ప్రాణాలకు ప్రమాదం ఉంది. ఈ క్రమంలో.. పశు వైద్యులు శస్త్రచికిత్స చేసి దాని మెడలోంచి 20 గ్రాముల కణితిని తొలగించి ప్రాణాలను కాపాడారు.
సీమాంచల్ ఎక్స్‌ప్రెస్‌లోని 2వ ఏసీ కోచ్‌లో టికెట్ లేకుండా ఓ మహిళ ప్రయాణిస్తుంది. ఆమె ఢిల్లీ నుంచి బీహార్‌కు వెళ్తుంది. న్యాయవాది అని చెప్పుకుంటున్న మహిళ టికెట్ లేకుండా రైలులోని సెకండ్ ఏసీలో ప్రయాణిస్తోంది. ఇంతలో టీటీఈ వచ్చి టికెట్ అడగ్గా ట్రైన్‌లో తీవ్ర గందరగోళం సృష్టించింది. తన పేరు చెప్పమని అడగ్గా.. చెప్పేందుకు నిరాకరించింది. టీటీఈతో పాటు తోటి ప్రయాణికులతో తీవ్ర వాగ్వాదానికి దిగింది.