Khairatabad Ganesh: ఈ ఏడాది ‘బడా గణేష్’ హుండీ ఆదాయం ఎంతో తెలుసా..?
- ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయం రూ. 70 లక్షలు
- హోర్డింగులు ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో 40 లక్షలు సమకూరినట్టు సమాచారం
- ఆన్లైన్ ద్వారా గణపతి చెంతన ఏర్పాటు చేసిన స్కానర్ల (గూగుల్ పే) ద్వారా విరాళాలు
- మొట్టమొదటిసారి సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగనున్న హుండీ లెక్కింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
9 రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్ మహా గణపతి.. రేపు గంగమ్మ ఒడికి చేరనున్నారు. అందుకోసం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి 9 గంటలకు ఖైరతాబాద్ మహా గణనాధుడికి మహా హారతి కార్యక్రమం నిర్వహించి.. 11.30 గంటలకు కలశం పూజ నిర్వహిస్తారు. ఆ తర్వాత.. రాత్రి 12 గంటల లోపు గణనాథుడిని కదిలిస్తారు. రేపు ఉదయం 7 గంటలకే గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. అయితే.. ఈ 9 రోజులు గణనాథుడికి ఘనంగా పూజలు చేశారు. అంతేకాకుండా.. భారీ సంఖ్యలో వచ్చి భక్తులు గణేషుడిని దర్శించుకున్నారు. కేవలం నగరంలో ఉండే వారే కాకుండా.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏపీ నుంచి కూడా గణనాథుడిని దర్శించుకున్నారు.
Memorial Meet: సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లో సీతారాం ఏచూరి సంస్మరణ సభ..
Also Read
దర్శనానికి వచ్చిన భక్తులు.. దేవుడికి కానుకలు సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలో.. భక్తులు ఈసారి ఖైరతాబాద్ గణేషుడి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. రూ. 70 లక్షలు కానుకల ద్వారా హుండీ ఆదాయం వచ్చినట్లు గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. అలాగే.. హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో రూ. 40 లక్షలు సమకూరినట్టు సమాచారం.. అంతేకాకుండా.. ఆన్లైన్ ద్వారా, గణపతి చెంతన ఏర్పాటు చేసిన స్కానర్ల (గూగుల్ పే) ద్వారా కూడా కొంత విరాళాలు వచ్చాయి.. వాటిని లెక్కించాల్సి ఉంది. కాగా.. హుండీ లెక్కింపును సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగనుంది. ఖైరతాబాద్‌లో గణపతి ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి మొట్టమొదటిసారి హుండీ లెక్కింపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరగడం విశేషం.
Knife Attack: సముద్రం తీరంలో కత్తులతో దాడి.. తీవ్రగాయాలతో వ్యక్తి మృతి
మరోవైపు.. బడా గణేష్‌ను దర్శించుకునేందుకు చివరి రోజు కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. దీంతో వెల్డింగ్, కర్ర తొలగింపు పనులకు ఆటంకం కలుగుతుంది. భక్తులను రోప్ సహాయంతో ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద నుంచి పంపించేస్తున్నారు పోలీసులు. మరోవైపు.. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!