కేసీఆర్, కేటీఆర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు మహిళకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వని సన్నాసులకు మహిళా అభివృద్ధి గురించి ఏం తెలుస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాజీవ్ గాంధీ తెచ్చిన కంప్యూటర్ పరిజ్ఞానంతోనే అమెరికా వెళ్లి జాబ్ చేశావు.. ఐటీ మంత్రి అయ్యావ్, లేకపోతే కేటీఆర్ మంత్రి దరిద్రం ఉండేది కాదు అని విమర్శించారు.
భారత పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ-ఫైనల్స్‌లో దక్షిణ కొరియాను 4-1తో ఓడించింది. ఫైనల్‌లో భారత్ చైనాతో తలపడనుంది. కాగా.. ఈ టోర్నీలో ఇండియా అద్భుత ప్రదర్శన చేసి అజేయంగా నిలిచింది. రేపు (మంగళవారం) భారత్-చైనాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ రోజు నాలుగో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా.. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ అంశంపై చర్చించారు.
యూపీలోని ఎటావాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లయి ఏడేళ్లయినా ఓ మహిళ తల్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకుంది. అయితే.. తన అత్తమామలు, భర్త కూడా పిల్లలు కావడం లేదని కొట్టి హింసించే వారని మహిళ తల్లిదండ్రులు ఆరోపించారు.
అనుమానం పిచ్చితో భార్యను హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. భర్త నర్సింహులు గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో గ్యాస్ డెలివరి బాయ్ గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం చిట్కుల్ గ్రామనికి చెందిన ఇందిరతో నర్సింహులుకి వివాహం అయింది. అయితే.. 13 ఏళ్లుగా సాఫీగా సాగుతున్న జీవితంలో అనుమానం అనే ఓ దెయ్యం వచ్చి ఓ నిండు జీవితాన్ని బలి తీసుకుంది. హైదరాబాద్‌లో భార్యను హత్య చేసి మృతదేహాన్ని స్వస్థలం ఆందోల్ కి తీసుకువచ్చాడు నిందితుడు. తన భార్య గుండెపోటుతో చనిపోయిందంటూ కుటుంబ…
సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ పేరుతో ఆ పార్టీ తెలంగాణ ప్రజలను వంచిస్తోందన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించినందున ‘తెలంగాణ ప్రజా వంచన దినోత్సవాన్ని’ నిర్వహించుకోవాలని ఎద్దేవా చేశారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు అరుదైన గౌరవం దక్కింది. నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందింది. ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు.. మెక్సికో దేశంలో న్యూవోలియోన్ లోని మోంటిగ్రో నగరంలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లును నిర్వాహకులు ఆహ్వానించారు.
పారిస్ పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నవదీప్ సింగ్.. తన జీవితంలో పడ్డ కష్టాలు, అవమానాల గురించి చెప్పాడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. పారాలింపిక్స్ 2024లో జావెలిన్ త్రో F41 విభాగంలో నవదీప్ బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే..
ముంబైలో రోడ్డు పక్కన నిల్చున్న ఓ మహిళను బైక్ పై వచ్చి ఓ వ్యక్తి ఢీ కొట్టాడు. అంతేకాకుండా.. ఆ మహిళపై హెల్మెట్‌తో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి 33 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.