మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మజ్‌గవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నుంజ ఖమ్‌హారియా గ్రామ సమీపంలో ట్రక్కు ఆటోను బలంగా ఢీకొట్టి.. అనంతరం ఆటోపై బోల్తాపడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మృతి చెందారు. అందులో ఒక చిన్నారి కూడా ఉంది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కరివేపాకును వంటలలో రుచి కోసం తరుచుగా ఉపయోగిస్తాం. అయితే.. ఇది రుచికే కాకుండా.. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకులో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇది శరీరం యొక్క మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కరివేపాకును రెగ్యులర్‌గా తినడం వల్ల శరీరంలోని అనేక భాగాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
భారత్‌లో రెండో మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళ ప్రభుత్వం బుధవారం దీనిని ధృవీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుండి ఇటీవల తిరిగి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి ఈ ఇన్‌ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. మలప్పురానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి యూఏఈ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పాజిటివ్‌గా తేలిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
ఏపీ కేబినెట్ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్ధసారథి వెల్లడించారు. నాణ్యమైన మద్యాన్ని అన్ని రకాల బ్రాండ్లను కేవలం రూ. 99కే అందించే నిబంధనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. గతంలో రూ. 120కి ఇచ్చిన మద్యాన్ని కొత్త పాలసీ ప్రకారం రూ. 99కే అందిస్తామని తెలిపారు.
సెప్టెంబర్ 21న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అతిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలియజేసారు. ఈ క్రమంలో.. అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్‌కి తన రాజీనామాను సమర్పించారు. అతిషి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దావా వేశారు.
వన్ నేషన్, వన్ ఎలక్షన్స్ ఆచరణ సాధ్యం కాదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. కేంద్రం ఈ ప్రతిపాదనను ప్రజలెవరూ అంగీకరించని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసలు సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ ఇలా చేస్తుందని ఖర్గే ఆరోపించారు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం టీ20 ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ తన అద్భుతమైన ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లి నంబర్ వన్ ఆల్ రౌండర్‌గా నిలిచాడు.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఐపీఎల్ (IPL)లో పంజాబ్ కింగ్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. కాగా.. ఐపీఎల్ 2024 తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని విడిచిపెట్టింది.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మరో అత్యాచార ఘటన జరిగింది. కమలా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పాఠశాల ఉపాధ్యాయుడు మూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం.. పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన బాలిక ప్రైవేట్ పార్ట్‌లపై గాయాలు చూసి బాలిక తల్లి ఒక్కసారి షాక్ అయింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.