ICC: ఆధిపత్యం చెలాయించిన ఆ దేశ ఆటగాళ్లు.. బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు వారికే
- ఉత్తమ ఆటగాళ్లకు అవార్డులను ప్రకటించిన ఐసీసీ
- ఆధిపత్యం చెలాయించిన శ్రీలంక ఆటగాళ్లు
- పురుషుల జట్టులో స్టార్ ఆల్ రౌండర్ దునిత్ వెలలాగే.. మహిళల జట్టులో హర్షిత సమరవిక్రమ ఎంపిక.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ఉత్తమ ఆటగాళ్లకు అవార్డులను ప్రకటించింది. ఈసారి శ్రీలంక ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించారు. పురుషుల జట్టులో స్టార్ ఆల్ రౌండర్ దునిత్ వెలలాగే, మహిళల జట్టులో హర్షిత సమరవిక్రమ ఆగస్టు నెలలో ప్లేయర్‌లుగా ఎంపికయ్యారు. ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అలాగే.. ఐర్లాండ్ పర్యటనలో హర్షిత ఆకట్టుకుంది. ఒక నెలలో ఒకే దేశానికి చెందిన పురుష, మహిళా ఆటగాళ్లు ఇద్దరూ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అందుకోవడం ఇది రెండోసారి. ఈ ఏడాది జూన్‌లో భారత ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా, స్మృతి మంధాన ఈ అవార్డును తీసుకున్నారు.
Yogi Adityanath: ‘‘పాకిస్తాన్ మానవాళికి క్యాన్సర్’’ .. విభజన పాపం కాంగ్రెస్‌దే..
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జాడెన్ సీల్స్‌ను అధిగమించి వెలలాగే ఈ అవార్డును గెలుచుకున్నాడు. భారత్‌పై శ్రీలంక 2-0తో సిరీస్ విజయం సాధించిన సమయంలో వెలలాగే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. 31 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్.. అజేయంగా 67, 39 రెండు ఇన్నింగ్స్‌లు ఆడడమే కాకుండా.. ఆ సిరీస్‌లో మొత్తం ఏడు వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక పురుష ఆటగాళ్లు ఈ అవార్డును అందుకోవడం ఐదోసారి. ఇంతకు ముందు ఏంజెలో మాథ్యూస్ (మే 2022), ప్రబాత్ జయసూర్య (జూలై 2022), వనిందు హసరంగా (జూన్ 2023), కమిందు మెండిస్ (మార్చి 2024) ఈ అవార్డును గెలుచుకున్నారు.
Karnataka: పాలస్తీనా జెండాలతో హల్‌చల్.. నలుగురు మైనర్లు అరెస్ట్
మరోవైపు.. మహిళల అవార్డు రేసులో హర్షిత ఐర్లాండ్‌కు చెందిన ఓర్లా ప్రెండర్‌గాస్ట్, గాబీ లూయిస్‌ను కిందకు నెట్టి వచ్చింది. ఐర్లాండ్ పర్యటనలో.. హర్షిత వన్డే ఇంటర్నేషనల్‌లో సెంచరీ చేసిన మూడవ శ్రీలంక మహిళా క్రికెటర్‌గా నిలిచింది. 26 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ హర్షిత రెండు టీ20 ఇంటర్నేషనల్స్‌లో 169.66 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 151 పరుగులు చేసింది. మొదటి మ్యాచ్‌లో 45 బంతుల్లో 86 పరుగులతో అజేయంగా నిలిచింది. అలాగే.. బెల్ఫాస్ట్‌లో జరిగిన మూడు వన్డేలలో 172 పరుగులు చేపింది. ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ఎంపికైన రెండో శ్రీలంక క్రికెటర్ హర్షిత. ఈ ఏడాది మే, జూలైలో శ్రీలంక కెప్టెన్ చమ్రీ అటపట్టు రెండుసార్లు ఈ టైటిల్‌ను గెలుచుకుంది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?