గణేశ్ లడ్డూ వేలం అంటేనే ముందుగా గుర్తొచ్చేది బాలాపూర్ లడ్డూ. ఆ లడ్డు దక్కించుకోవడం కోసం చాలా మంది పోటీ పడతారు. అదే స్థాయిలో ధర కూడా రికార్డ్ స్థాయిలో పలుకుతుంది. ఏడాది ఏడాదికి పెరుగుతూ వస్తోంది. ఈ లడ్డూను దక్కించుకుంటే మంచి జరుగుతుందని, సుఖ సంతోషాలతో జీవిస్తామని భక్తుల నమ్మకం. అంతేకాకుండా.. ఆ గణనాథుడి కరుణ కటాక్షాలు ఏడదంతా ఉంటాయని బలంగా నమ్ముతారు అందుకోసం ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా వెనుకాడరు.
Read Also: Minister Ram Prasad Reddy: మంగంపేట భూనిర్వాసితులకు ఇళ్లపట్టాలను పంపిణీ చేసిన మంత్రి
తొలిసారి బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం పాట 1994లో ప్రారంభమైంది. అప్పట్లోనే రూ. 450కు కొలను మోహన్ రెడ్డి దక్కించుకున్నారు. ఆ లడ్డూను అతడు తన కుటుంబ సభ్యులకు పంచి.. మిగిలిన దానిని తన పొలంలో చల్లుకోవడంతో ఆయనకు బాగా కలిసి వచ్చినట్లు అతడే తెలిపాడు. అలా.. ఏడాదికి ఏడాది ఈ వేలం పెరుగుతూ వస్తుంది. అప్పుడు వందల్లో ఉన్న వేలం.. ఇప్పుడు లక్షలకు మారింది. గతేడాది రూ. 27 లక్షలకు దాసరి దయానంద రెడ్డి సొంతం చేసుకున్నాడు. అయితే ఈ ఏడాది ఈ లడ్డూ వేలం రూ.30 లక్షలకు పైగా పలకొచ్చనేది అంచనా.
Read Also: Chidambaram: చిదంబరం కీలక వ్యాఖ్యలు.. జమిలి ఎన్నికలు అసాధ్యమని వెల్లడి
ఇదిలా ఉంటే.. బాలాపూర్ లడ్డూకు ఉన్న డిమాండ్ కారణంగా కమిటీ నిర్వాహకులు కొత్త రూల్ తీసుకువచ్చారు. లడ్డూ వేలంలో పాల్గొనే పోటీదారులు ముందస్తుగా డబ్బును డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. గతంలో బయటి వ్యక్తులు మాత్రమే లడ్డూ వేలంలో పాల్గొనే వారు. ఈసారి స్థానిక బాలాపూర్ గ్రామ ప్రజలు కూడా ఈ వేలంలో పాల్గొంటే ముందస్తూ డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. కాగా.. బాలాపూర్ లడ్డూ వేలం రేపు (మంగళవారం) ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభం కానుంది.