భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వేలాది రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే.. ఈ రైళ్లలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణీకులు తమ స్థలం నుండి మరొక ప్రదేశానికి సులభంగా రైళ్లలో ప్రయాణిస్తున్నారు. భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా పెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. భారతీయ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటిగా పేరు పొందింది.
బీహార్‌లో మరో రైలుకు ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగాయి. దీంతో.. ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటన కిషన్‌గంజ్ రైల్వే స్టేషన్ కు 200 నుంచి 250 మీటర్ల దూరంలో ఉన్న ఫరింగోరా సమీపంలో జరిగింది. కిషన్‌గంజ్ నుండి సిలిగురికి వెళ్లే DMU ప్యాసింజర్ రైలు ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌లో మంటలు వచ్చాయి.
కోల్‌కతాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో ఓ వ్యక్తి మహిళపై వేధింపులకు పాల్పడ్డాడు. హెల్త్ వర్కర్ అయిన 26 ఏళ్ల మహిళపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తన బిడ్డను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చింది. అయితే.. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
శనివారం బ్రస్సెల్స్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. తాను ఈ మ్యాచ్‌లో ఆడేందుకు విరిగిన చేయితో వచ్చానని వెల్లడించాడు. Xలో పోస్ట్ ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలిపాడు. తన ఎడమ చేతిలో నాల్గవ మెటాకార్పల్ ఫ్రాక్చర్ అయినప్పటికీ పోటీలో పాల్గొన్నానని పేర్కొన్నాడు. ప్రాక్టీస్ సమయంలో గాయమైందని చెప్పాడు.
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న ఆరుగురు మృత్యువాత చెందారు. ఖతుశ్యామ్ బాబాను దర్శించుకునేందుకు వెళ్తుండగా జైపూర్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గుర్తు తెలియని వాహనం భక్తులతో వెళ్తున్న కారును ఢీకొట్టింది.
బీహార్‌లోని గయాలో పెను రైలు ప్రమాదం తప్పింది. గూడ్స్ రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం రఘునాథ్‌పూర్ గ్రామ సమీపంలోని వజీర్‌గంజ్ స్టేషన్, గయా-కోడెర్మా రైల్వే సెక్షన్‌లోని కొల్హానా హాల్ట్ మధ్య జరిగింది. ఇంజిన్‌ను లూప్‌లైన్ నుంచి గయా వైపు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఇంజన్ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది.
భారత వాతావరణ శాఖ ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది. గంగా నది పశ్చిమ బెంగాల్‌పై లోతైన అల్పపీడనం ఏర్పడిన ప్రభావంతో.. ఈరోజు, రేపు జార్ఖండ్, గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత 24 గంటల్లో గంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, బీహార్‌లో భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదైంది.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భద్రతలో భారీ లోపం వెలుగు చూసింది. బెంగళూరులో ఇంటర్నేషనల్ డెమొక్రసీ డే వేడుకలకు హాజరైన సీఎం.. స్టేజ్ పై కూర్చుని ఉండగా అనుకోని సంఘటన జరిగింది. గుర్తు తెలియని ఓ యువకుడు సెక్యూరిటీని దాటుకుని మరీ వేదికపైకి దూసుకొచ్చాడు. అతని చేతిలో ఉన్న శాలువాని సిద్ధరామయ్యపైకి విసిరాడు. వెంటనే అలర్ట్ అయిన సీఎం భద్రతా సిబ్బంది అతడిని పట్టుకున్నారు.
టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ ఎక్స్‌పర్ట్ ఆకాష్ చోప్రా.. ఇటీవల టీమిండియా ప్యూచర్ ఆటగాళ్లు ఎవరో చెప్పారు. ముగ్గురు యువ ఆటగాళ్ల గురించి చెప్పారు. అందులో.. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ ఉన్నారు.